PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramojirao97711f44-b7aa-4edb-9528-76ac78120a3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramojirao97711f44-b7aa-4edb-9528-76ac78120a3a-415x250-IndiaHerald.jpgరామోజీరావు ఈటీవీ సంస్థల అధినేత.. ప్రముఖ మీడియా దిగ్గజం సినీ మొఘల్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు... అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆయనను జూన్ 5న హైదరాబాదులోని నానక్ రామా గూడా లో లోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు.. వైద్యులు ఈయన గుండెకు స్టంట్ అమర్చి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తూ ఉండేవారు.. కానీ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచినప్పటికీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడRAMOJIRAO{#}Priya;usha;Andhra Pradesh;Telugu;media;November;Cancer;June;ramoji rao;eenadu;TDPరామోజీరావు... ప్ర‌భుత్వాల‌నే శాసించిన అక్షర యోధుడు...!రామోజీరావు... ప్ర‌భుత్వాల‌నే శాసించిన అక్షర యోధుడు...!RAMOJIRAO{#}Priya;usha;Andhra Pradesh;Telugu;media;November;Cancer;June;ramoji rao;eenadu;TDPSat, 08 Jun 2024 07:16:00 GMTరామోజీరావు ఈటీవీ సంస్థల అధినేత.. ప్రముఖ మీడియా దిగ్గజం సినీ మొఘల్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు... అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆయనను జూన్ 5న హైదరాబాదులోని నానక్ రామా గూడా లో లోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు.. వైద్యులు ఈయన గుండెకు స్టంట్ అమర్చి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తూ ఉండేవారు.. కానీ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచినప్పటికీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దప్రేగు క్యాన్సర్ తో పోరాడి చివరికి విజయవంతంగా కోలుకున్నారు.. కానీ ఆ క్యాన్సర్ వ్యాధి నమూనాలు ఆయనను ఇంకా బాధపెట్టాయనే చెప్పాలి.. ఇక చివరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి తుది శ్వాస విడిచారు.


రామోజీరావు ధనవంతులుగా ఎదగడం స్ఫూర్తిదాయకమైన కథ అని చెప్పాలి.. 1936 నవంబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి..  ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ..అంతేకాదు తన సంస్థల ద్వారా ఎంతో మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించి పరోక్షంగా వారికి ఆర్థిక అండగా నిలిచారు.. ఇకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్ మరియు ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీని స్థాపించిన ఘనత కూడా ఈయనకే సొంతం..


మార్గదర్శి , రమాదేవి పబ్లిక్ స్కూల్, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, కళాంజలి , ఉషా కిరణ్ మూవీస్ , డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ రామోజీరావుకు చెందిన సంస్థలు. ఇక ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా ఉన్న టిడిపి పార్టీకి మార్గదర్శి అని చెప్పవచ్చు.. అంతేకాదు టిడిపి పార్టీతో పాటు ప్రభుత్వాలను కూడా సక్రమంగా పనిచేసేలా తీర్చిదిద్దిన అక్షర యోధుడు అని చెప్పవచ్చు.. ఈనాడు దినపత్రిక ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని తెలిస్తే.. ఆ విషయాలను ఎండగడుతూ.. తన అక్షర రూపంలో ఈనాడు దినపత్రిక ద్వారా ప్రజలకు చేరవేసి తద్వారా ప్రభుత్వాలనే మార్చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఈనాడు దినపత్రిక తెలుగు నాట ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ పత్రిక ద్వారా ప్రపంచ నలమూలలా ఉన్న వార్తలను ప్రజలకు చేరవేసి ప్రభుత్వాలను కూడా సరైన మార్గంలో నడిచేలా చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>