MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood335bb8d9-db0a-40eb-9cb1-7ed9b5dde00d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood335bb8d9-db0a-40eb-9cb1-7ed9b5dde00d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రాబోతోంది. ఎస్ ఎస్ ఎన్ బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా త్రిబుల్ ఆర్ అంత పెద్ద హిట్ అవ్వాలి అని ఆశిస్తున్నాడు రాజమౌళి .ఇకపోతే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్స్ నేపథ్యంలో రాబోతోంది. దుర్గా బ్యానర్ పై tollywood{#}Rajamouli;Hollywood;Good news;Good Newwz;mahesh babu;Guntur;Amazon;Telugu;News;media;Cinemaమహేష్ బాబు, రాజమౌళి మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..!?మహేష్ బాబు, రాజమౌళి మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..!?tollywood{#}Rajamouli;Hollywood;Good news;Good Newwz;mahesh babu;Guntur;Amazon;Telugu;News;media;CinemaFri, 07 Jun 2024 11:10:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రాబోతోంది. ఎస్ ఎస్ ఎన్ బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా త్రిబుల్ ఆర్ అంత పెద్ద హిట్ అవ్వాలి అని ఆశిస్తున్నాడు రాజమౌళి .ఇకపోతే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్స్ నేపథ్యంలో రాబోతోంది. దుర్గా బ్యానర్ పై కే ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా

 నేపథ్యంలో రాబోతోంది. అంతేకాదు ఇందులో కేవలం తెలుగు స్టార్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ స్టార్స్ సైతం రంగంలోకి దింపబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే దీనికి సంబంధించిన ఒక భారీ సెట్ ను రాజమౌళి రామోజీ ఫిలిం సిటీ లో దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేసి మరి ఏర్పాటు చేసినట్లుగా సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమా మొత్తం అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాబోతోంది. అందుకే దానికి సంబంధించిన సెట్ ఏర్పాటు చేసి దాదాపుగా

 షూటింగ్ మొత్తం అక్కడే పూర్తి చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. ఎందుకంటే మహేష్ బాబు నుండి వచ్చిన గత సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన అభిమానులు అందరూ రాజమౌళితో వచ్చే సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి.. ఎందుకంటే 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>