Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/paka9c52e87-c62a-4626-8a60-67b171b2954a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/paka9c52e87-c62a-4626-8a60-67b171b2954a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యుఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. అయితే మొత్తంగా 20 టీమ్స్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్నాయ్. అయితే ఎన్ని టీమ్స్ పాల్గొన్నప్పటికీ.. కొన్ని టీమ్స్ మాత్రమే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగే టీమ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి. అయితే టైటిల్ ఫేవరెట్ గా Pak{#}West Indies;Venkatesh;Cricket;Pakistan;World Cupప్చ్.. పాకిస్థాన్ పసికూన చేతిలో ఓడిందిగా?ప్చ్.. పాకిస్థాన్ పసికూన చేతిలో ఓడిందిగా?Pak{#}West Indies;Venkatesh;Cricket;Pakistan;World CupFri, 07 Jun 2024 12:00:00 GMTప్రస్తుతం యుఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. అయితే మొత్తంగా 20 టీమ్స్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్నాయ్. అయితే ఎన్ని టీమ్స్ పాల్గొన్నప్పటికీ.. కొన్ని టీమ్స్ మాత్రమే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగే టీమ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి. అయితే టైటిల్ ఫేవరెట్ గా ఉండే పాకిస్తాన్ ఆట తీరు మాత్రం కొన్ని కొన్ని సార్లు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.


 ఎందుకంటే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకునే పాకిస్తాన్ జట్టు.. కొన్ని కొన్ని సార్లు చెత్త ప్రదర్శనలతో నిరాశ పరుస్తూ ఉంటుంది. ఏకంగా ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శనతో గెలిచే పాకిస్తాన్.. తప్పకుండా గెలుస్తుంది  అనుకున్న కొన్ని మ్యాచ్లలో మాత్రం దారుణమైన ఓటమి చవి చూస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి ఒక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్ జట్టు. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచ కప్ లో పసికూన అయిన యూఎస్ఏ జట్టు చేతిలో ఓడిపోయింది. ఎంతో సునాయాసంగా గెలుస్తుంది అనుకుంటే.. చివరికి ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది.



 ఏకంగా తప్పకుండా గెలుస్తాము అనే ధీమాతోనే మ్యాచ్లో బలిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును ఆతిథ్య యూఎస్ఏ జట్టు సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్లింది. ఇక ఎంతో థ్రిల్లింగ్ గా  సాగిన ఈ మ్యాచ్ లో.. చివరికి విక్టరీ అమెరికా వైపే నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది  అయితే అటు లక్ష్య చేదనలో యూఎస్ఏ మరింత మెరుగ్గా రాణించింది  మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి మ్యాచ్ ను టై చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా యూఎస్ఏ 18/1 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 13 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో యుఎస్ఏ జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>