PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsdd88415c-b3f1-42ac-847c-a07c32ca4f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsdd88415c-b3f1-42ac-847c-a07c32ca4f26-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.కూటమిలో భాగంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. పోటీ చేసిన 21అసెంబ్లీ స్థానాలు అలాగే 2ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు.పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70వేల మెజార్టీతో గెలుపొంది సూపర్ హిట్ అయ్యారు. ఈ ఎన్నికలలో ఈసీ జనసేన పార్టీకు 'గాజు గ్లాస్' ను గుర్తుగా కేటాయించింది. అయితే ఈమధ్య అదే గుర్తు వేరే పార్టీకి కేటాయించడం పై జనసేన అధిasembly elections{#}Pawan Kalyan;Janasena;Parliment;Assembly;MP;Election Commission;Party;Bharatiya Janata Partyజనసేన : 'గాజు గ్లాస్' గుర్తు ఇక శాశ్వితంగా పవన్ కళ్యాణ్ దే..!జనసేన : 'గాజు గ్లాస్' గుర్తు ఇక శాశ్వితంగా పవన్ కళ్యాణ్ దే..!asembly elections{#}Pawan Kalyan;Janasena;Parliment;Assembly;MP;Election Commission;Party;Bharatiya Janata PartyFri, 07 Jun 2024 06:46:35 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.కూటమిలో భాగంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. పోటీ చేసిన 21అసెంబ్లీ స్థానాలు అలాగే 2ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు.పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70వేల మెజార్టీతో గెలుపొంది సూపర్ హిట్ అయ్యారు. ఈ ఎన్నికలలో ఈసీ జనసేన పార్టీకు 'గాజు గ్లాస్' ను గుర్తుగా కేటాయించింది. అయితే ఈమధ్య అదే గుర్తు వేరే పార్టీకి కేటాయించడం పై జనసేన అధినేత అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుపై పోటీ చేసి అంతగా ప్రభావం చచూపలేకపోయింది.  2019లో జనసేనకు ఆరు శాతం ఓట్లు కంటే కొద్ది ఓట్లు తక్కువ వచ్చాయి. అసెంబ్లీ స్థానం కూడా ఒక్కటే వచ్చింది. కనీసం ఒక లోక్సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది. ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది. కానీ అవేమీ అప్పటి ఎన్నికల్లో రాలేదు.దీంతో ఈసీ 'గాజు గ్లాసు'ను జనరల్ కేటగిరీలో ఉంచింది. ఈ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయని స్థానాల్లో 'గాజు గ్లాసు' గుర్తును ఫ్రీ సింబల్ చేసింది. అయితే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో సింబల్‌కు సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి.ఈ ఎన్నికల్లో జనసేన సాధించిన విజయానికి పార్టీ గుర్తుపై ఈసీ గుడ్ న్యూస్ చెప్పనుంది.జనసేన పార్టీకి 'గాజు గ్లాసు' గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. అయితే శాశ్వతంగా ఏ పార్టీకైనా గుర్తు రావాలంటే.. అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవాల్సి ఉంటుంది.పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత అద్బుతమైన విజయాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా సాధించలేకపోయిన గుర్తింపును ఇప్పుడు సాధించడంతో జనసేన నేతలు, కార్యకర్తల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>