PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kulwinder-kaur--kangana-ranaut8e32fbf6-99ab-4070-b995-bc619b2495e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kulwinder-kaur--kangana-ranaut8e32fbf6-99ab-4070-b995-bc619b2495e0-415x250-IndiaHerald.jpgకామ్ గా ఉండేవాళ్ళని కెలికి ఎప్పుడు వివాదాలతో సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వాళ్లలో బాలీవుడ్ హీరోయిన్ బీజేపీ ఎంపీ కంగనా ముందు వరుసలో ఉంటుంది. ఈవిడ జనాలకు మేలు చేయదు గాని అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ పాపులర్ అవ్వాలని కోరుకుంటుంది. ఈవిడ తీరు చూస్తే నిజంగా సగటు ప్రేక్షకుడికి కూడా చెంప చెల్లుమనిపించేలా ఉంటుంది. అనుకున్నట్టు గానే ఓ లేడీ జవాన్ ఈమె చెంప పగలగొట్టింది. దీంతో ఆ జవాన్ పై వేటు పడినట్లు వార్తలు వస్తున్నాKulwinder Kaur - Kangana Ranaut{#}Cheque;Jawaan;Punjabi;netizens;vishal krishna;WOMEN;Kangana Ranaut;bollywood;job;Director;News;media;Bharatiya Janata Partyబీజేపీ ఎంపీ కంగనా చెంప పగలగొట్టిన లేడీ జవాన్ కి లక్ష నజరానా, జాబ్ ఆఫర్?బీజేపీ ఎంపీ కంగనా చెంప పగలగొట్టిన లేడీ జవాన్ కి లక్ష నజరానా, జాబ్ ఆఫర్?Kulwinder Kaur - Kangana Ranaut{#}Cheque;Jawaan;Punjabi;netizens;vishal krishna;WOMEN;Kangana Ranaut;bollywood;job;Director;News;media;Bharatiya Janata PartyFri, 07 Jun 2024 20:52:00 GMTబాలీవుడ్ హీరోయిన్ బీజేపీ ఎంపీ కంగనా ముందు వరుసలో ఉంటుంది. ఈవిడ జనాలకు మేలు చేయదు గాని అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ పాపులర్ అవ్వాలని కోరుకుంటుంది. ఈవిడ తీరు చూస్తే నిజంగా సగటు ప్రేక్షకుడికి కూడా చెంప చెల్లుమనిపించేలా ఉంటుంది. అనుకున్నట్టు గానే ఓ లేడీ జవాన్ ఈమె చెంప పగలగొట్టింది. దీంతో ఆ జవాన్ పై వేటు పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. ఆమె ఉద్యోగం పోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ ఆమెకు ఉద్యోగం పోతే తనకు మంచి జాబ్ ఇస్తానని బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ విశాల్ దడ్లని జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు వచ్చాడు. తన గొప్ప మనసు చాటుకున్నాడు.


 ''చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏదో జరిగిందని మీడియా ద్వారా నాకు తెలిసింది. కంగనా మొబైల్, పర్సు చెక్ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని నాకు అర్థమైంది.మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉంది. ఇక అదే ఈ సంఘటనకు దారి తీసింది. సైనికులు, రైతులు ఇద్దరూ కూడా ముఖ్యమైనవారు. అన్ని విధాలుగా వారు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ విషయంలో మేం ఆమెకు పూర్తి మద్దతుగా ఉంటాం'' అని కంగనా రనౌత్‌ను చెంప పగలగొట్టిన వీర వనిత సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను ఆమె సోదరుడు రైతు నాయకుడు, పంజాబ్‌లోని కపుర్తలా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి అయిన షేర్ సింగ్ మహివాల్ మెచ్చుకుంటూ తన సోదరికి మద్దతుగా నిలిచాడు.


ఇదిలా ఉంటే హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా చెంప పగల కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ చర్యను పంజాబ్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా సమర్థించడం జరిగింది. మొహాలీలోని జిరాక్‌పూర్‌కు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు ఏకంగా లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు ఇంకా పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్‌కు ఆయన సెల్యూట్ చేశాడు.


ప్రస్తుతం కంగనా చెంపని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఆ లేడీ జవాన్ కి నెటిజన్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తుంది. సామాన్య రైతుల జోలికి వస్తే ఇలానే చెంప పగలగొడతామని కంగానాకి వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్స్. నిన్న చండీఘడ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ చెంపదెబ్బ కొట్టింది. కేంద్రప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆందోళనలకు దిగిన మహిళా రైతుల గురించి కంగనా అర్ధం పర్ధం లేకుండా వాగినందుకు ఆ లేడీ జవాన్ ఇలా చెంప పగలగొట్టింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>