Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith24577e4f-bac3-44e1-8f28-f5f8bda2fea5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith24577e4f-bac3-44e1-8f28-f5f8bda2fea5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొన సాగుతున్న రోహిత్ శర్మ.. తన సారథ్యంతో ఎంతలా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టీమిండియా కెప్టెన్సీ చేపట్టక ముందే తనలో ఉన్న కెప్టెన్సీ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఏకంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఆ జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా రోహిత్ శర్మ ఐపీఎల్లో సూపర్ సక్సెసRohith{#}MS Dhoni;VIRAT KOHLI;Rohit Sharma;Ireland;Mumbai;Pakistan;World Cup;India;Success;Juneకెప్టెన్ గా రోహిత్ అరుదైన రికార్డ్.. ధోనిని దాటేశాడు?కెప్టెన్ గా రోహిత్ అరుదైన రికార్డ్.. ధోనిని దాటేశాడు?Rohith{#}MS Dhoni;VIRAT KOHLI;Rohit Sharma;Ireland;Mumbai;Pakistan;World Cup;India;Success;JuneFri, 07 Jun 2024 11:00:00 GMTప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొన  సాగుతున్న రోహిత్ శర్మ.. తన సారథ్యంతో ఎంతలా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టీమిండియా కెప్టెన్సీ చేపట్టక ముందే తనలో ఉన్న కెప్టెన్సీ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఏకంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఆ జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ఇలా రోహిత్ శర్మ ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టే అతనికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా వచ్చాయి అని చెప్పాలి  ఇలా కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. తన సారథ్యంతో అదరగొట్టేసాడు. టీమిండియాని మూడు ఫార్మాట్లలో కూడా విజయపతంలో ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే కెప్టెన్గా అతని విన్నింగ్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పాలి.  అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ సారధ్యంలోనే టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ లో విజయం ద్వారా అటు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 ఫార్మాట్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా నిలిచాడు. సారధిగా వ్యవహరించిన 55 మ్యాచ్ లలో రోహిత్ శర్మ 42 విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత స్థానంలో మహేంద్రసింగ్ ధోని 72 మ్యాచ్లలో 41 విజయాలు అందించి రెండవ ప్లేస్ లో ఉన్నాడు. మరోవైపు వన్డే ఫార్మాట్ లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా ధోని,  టెస్టుల్లో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. కాగా టీమిండియా జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>