PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan94b0a98c-4a1d-4425-b6d4-5523fcfea38a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan94b0a98c-4a1d-4425-b6d4-5523fcfea38a-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ 100% సక్సెస్ రేట్ తో భారతీయ ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ అంత ఈజీగా ఏమీ రాలేదు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చాలా సహనంగా కొనసాగుతూ రాజకీయాల్లో అన్నీ భరించారు. ఎవరూ నమ్మకపోయినా తాను మాత్రం విజయం సాధించడం పక్కా అని ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేశారు. పిఠాపురంలో పవన్ గెలుస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారితే పవన్ మాత్రం అక్కడ కచ్చితంగా గెలిచేలా కేడర్ ని తన గాఢిలో పెట్టుకున్నారు.pawan kalyan{#}Prajarajyam Party;Jagan;Success;Party;MP;Janasena;kalyan;Andhra Pradeshఏపీలో అసలైన కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్..??ఏపీలో అసలైన కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్..??pawan kalyan{#}Prajarajyam Party;Jagan;Success;Party;MP;Janasena;kalyan;Andhra PradeshFri, 07 Jun 2024 10:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ 100% సక్సెస్ రేట్ తో భారతీయ ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ అంత ఈజీగా ఏమీ రాలేదు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చాలా సహనంగా కొనసాగుతూ రాజకీయాల్లో అన్నీ భరించారు. ఎవరూ నమ్మకపోయినా తాను మాత్రం విజయం సాధించడం పక్కా అని ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేశారు. పిఠాపురంలో పవన్ గెలుస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారితే పవన్ మాత్రం అక్కడ కచ్చితంగా గెలిచేలా కేడర్ ని తన గాఢిలో పెట్టుకున్నారు.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలనివ్వను అని 2022లో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. అదే కూటమికి ఊపిరి పోసింది. ప్రజా వ్యతిరేక ఓటు చీలితే టీడీపీ, బీజేపీ, జనసేన ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవి కావు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని పవన్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ మాటకు అనుగుణంగానే ఆయన పొత్తు, అసెంబ్లీ, ఎంపీ సీట్ల కేటాయింపు విషయంలో వ్యవహరించారు.

ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది, నాతో మీరు ప్రయాణించడానికి సిద్ధమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు. తన బలాలు బలహీనతలు పూర్తిగా తెలుసుకొని ప్రజల అభిమానాన్ని గెలుచుకోగలిగారు. తన అన్న ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందో విశ్లేషించుకొని పవన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.

ప్రత్యేక హోదా విషయాన్నీ బాగా హైలెట్ చేశారు. జగన్ బీజేపీ ఇచ్చిన పాచిపోయిన లడ్డులతో సరిపెట్టుకున్నారని, ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని ప్రసంగాలు ఇస్తూ పవన్ చాలా బాగా ప్రజల్లో పాపులర్ అయ్యారు. 2024లో అవినీతి, అరాచకం పరిపాలన చేస్తున్న జగన్‌ను గద్దె దించే లక్ష్యంతో ఆయన బీజేపీ, టీడీపీతో కలిసి అడుగులు వేశారు. చివరికి తాను అనుకున్నది సాధించారు. ఏపీ రాజకీయాలను ఒక మలుపు తిప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>