PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-kalyan-ap-ycp-tdp-janasena7798d385-bea5-4edb-8b21-c39a235ab614-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-kalyan-ap-ycp-tdp-janasena7798d385-bea5-4edb-8b21-c39a235ab614-415x250-IndiaHerald.jpgఅలుపెరగని పోరాటం, ఆయాసం రాని ఆరాటం, తాను అనుకున్న లక్ష్యం వైపే ప్రయాణం, అలా సంవత్సరాల పాటు శ్రమించి, కష్టించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఓకే దెబ్బతో అటు జనసేన, ఇటు టిడిపిని బయటపడేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవ్వరు ఏమన్నా, ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా, రక్తం కారినా, గుండె పగిలిపోయినా తాను అనుకున్న లక్ష్యాన్ని చేధించడానికి ముందుకు కదిలాడు తప్ప మడమ తిప్పలేదు. చీమకు కూడా హాని చేయని పవనన్నను ఎన్నో నోళ్లు నిందించాయి. చీమను నలిపినట్టు నలిపేశాయి. నీతో అవుతుందా అన్నారు.. సినిమాల్లో వేషాలు CHANDRABABU;PAWAN KALYAN;AP;YCP;TDP;JANASENA{#}politics;Heart;Yevaru;Jagan;Bharatiya Janata Party;Parliment;Congress;Manam;News;YCP;Minister;Pawan Kalyan;Janasena;Andhra Pradesh;TDP;Cinema;kalyan;CBNచంద్రబాబు టీం : పవర్ స్టార్ కు ఏ "పవర్" ఇస్తారో.?చంద్రబాబు టీం : పవర్ స్టార్ కు ఏ "పవర్" ఇస్తారో.?CHANDRABABU;PAWAN KALYAN;AP;YCP;TDP;JANASENA{#}politics;Heart;Yevaru;Jagan;Bharatiya Janata Party;Parliment;Congress;Manam;News;YCP;Minister;Pawan Kalyan;Janasena;Andhra Pradesh;TDP;Cinema;kalyan;CBNThu, 06 Jun 2024 10:17:10 GMT- ఆ కీలక మంత్రి పదవి పవన్ ను వరించేనా.?
- రైతులకు మేలు చేసే మంత్రి పదవి కావాలనుకుంటున్నారా.?


అలుపెరగని పోరాటం, ఆయాసం రాని ఆరాటం, తాను అనుకున్న లక్ష్యం వైపే ప్రయాణం, అలా సంవత్సరాల పాటు శ్రమించి, కష్టించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఓకే దెబ్బతో అటు జనసేన, ఇటు టిడిపిని బయటపడేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవ్వరు ఏమన్నా, ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా, రక్తం కారినా, గుండె పగిలిపోయినా తాను అనుకున్న లక్ష్యాన్ని చేధించడానికి ముందుకు కదిలాడు తప్ప మడమ తిప్పలేదు. చీమకు కూడా హాని చేయని పవనన్నను ఎన్నో నోళ్లు నిందించాయి. చీమను నలిపినట్టు నలిపేశాయి. నీతో అవుతుందా అన్నారు.. సినిమాల్లో వేషాలు వేసుకునే వాడికి రాజకీయాలు సెట్ అవుతాయా అని హేళన చేశారు. ఎవరు ఏమన్నా ఆగదు నా పోరాటం అంటూ తను అనుకున్న దానికోసం ముందుకు కదిలాడు. తను ఒక్కడే ఎదగడం కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగిన పవన్ కళ్యాణ్ కు జనాలు నీరాజనాలు పట్టారు. కనివిని ఎరుగని విజయాన్ని అందించారు. జనసేనా అంటే కాలర్ ఎగరేసుకునేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టి ఘన విజయాన్ని సాధించారు. మరి ఆయన చేసిన కష్టానికి ఫలితం ఏం రాబోతోంది. ఆయనకు రాష్ట్రంలో ఎలాంటి పవర్ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

 పరాజయలతో మొదలై దిక్కులు పెక్కటిల్లెలా విజయాన్ని సాధించాడు.  వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ శపథం చేసి మరీ  అనుకున్నది సాధించాడు జనసేనాని. ఆనాడు గుర్తుపెట్టుకో జగన్ నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయకపోతే నా పేరు  పవన్ కళ్యాణే కాదని  తొడకొట్టి మరీ చెప్పారు. కానీ ఆ టైంలో పవన్ అలా మాట్లాడుతుంటే సినిమా డైలాగు లాగా చాలామంది లైట్ తీసుకున్నారు.  కానీ పవన్ కళ్యాణ్ తాను అన్న మాటను నిలబెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడి అనుకున్నది అనుకున్నట్టుగానే సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అదఃపాతాళానికి తొక్కేశారు.

 మారిన రాజకీయాలు:
 ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. ఈ టైంలోనే పూర్తిగా వెలుగులోకి వచ్చినటు వంటి పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసి పొత్తు ఉంటేనే మనం వైసీపీని ఎదుర్కోగలమనే ఆలోచనకు వచ్చారు. అటు బీజేపీనీ కూడా ఒప్పించి బిజెపి, జనసేన, టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నారు.  అంతేకాదు పొత్తులో భాగంగా ఒక్క ఓటు చీలిపోకూడదని ప్రతి సభలో  తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి జనసేన సైనికులకు దిశా నిర్దేశం చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా కీలకమైన ఆలోచనలు చేస్తూ ముందుకు కదిలారు. పవన్ కళ్యాణ్ పేరు ఉంది కాబట్టే అటు బిజెపి, ఇటు టిడిపి తనను ఆదరిస్తూ వచ్చాయి. 2014లో ఎన్నికల్లో కూడా టిడిపి   పవన్ కళ్యాణ్ సహకారం తీసుకుంది. 2009లో  పిఆర్ పికి ప్రచారం చేసి  18 సీట్లు సాధించాడు. 2014లో టిడిపి, బిజెపికి పవన్ ప్రచారం చేసి  ఈ రెండు పార్టీలను ఏపీలో గెలిచేలా చేశాడు. ఇక 2019లో కాస్త దూరమైనటువంటి పవన్ కళ్యాణ్, 2024లో వ్యూహాత్మకంగా ఆలోచన చేసి పట్టుదలతో జనసేన తీసుకున్న 21 స్థానాల్లో  21 స్థానాలు గెలిపించేలా చేశారు. టిడిపికి 135 బిజెపికి 8 స్థానాలు  అందించారు. వైసిపిని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేలా చేశాడు. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే..జనసేన తీసుకున్న రెండు స్థానాల్లో విజయం సాధించింది బిజెపి తీసుకున్న 3 స్థానాల్లో విజయం అందుకుంది. టిడిపి 16  వైయస్సార్సీపి 4 మాత్రమే కైవసం చేసుకుంది. ఈ విధంగా కూటమికి  భారీ మెజారిటీ అందించడంలో పవన్ కీలక రోల్ పోషించారని చెప్పవచ్చు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కు  డిప్యూటీ సీఎంతో పాటు ఏపీ హోం మంత్రి లేదంటే, ఆర్థిక శాఖ మంత్రి  పదవి ఇవ్వనున్నట్టు  వార్తలు వినిపిస్తున్నాయి.  కానీ ఆయన మాత్రం రైతులకు మేలు చేసే మంత్రి పదవి కావాలనే ఆలోచన చేస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>