PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap865c2017-4a4e-45ca-99cd-21780d38c7ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap865c2017-4a4e-45ca-99cd-21780d38c7ea-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దిగిపోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కొత్త ప్రభుత్వం ఏపీలో రాబోతున్న నేపథ్యంలో... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల బదిలీలు, ట్రాన్స్ఫర్లు, అలాగే పదోన్నతులు... ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ap{#}vijayanand;రాజీనామా;Kothapalli Samuel Jawahar;Telugu Desam Party;News;Government;Andhra Pradesh;YCP;CBNజ‌వ‌హ‌ర్ రెడ్డి ఔట్‌ఏపీకి కొత్త సీఎస్ వచ్చేశాడు !జ‌వ‌హ‌ర్ రెడ్డి ఔట్‌ఏపీకి కొత్త సీఎస్ వచ్చేశాడు !ap{#}vijayanand;రాజీనామా;Kothapalli Samuel Jawahar;Telugu Desam Party;News;Government;Andhra Pradesh;YCP;CBNThu, 06 Jun 2024 14:28:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దిగిపోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కొత్త ప్రభుత్వం ఏపీలో రాబోతున్న నేపథ్యంలో... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల బదిలీలు, ట్రాన్స్ఫర్లు, అలాగే పదోన్నతులు... ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.

 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సిఎస్ మార్పు అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ గా విజయానంద్  అనే ప్రభుత్వ అధికారిని నియమించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం విజయానంద్...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయనందు పనిచేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇవాళ సాయంత్రం... దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది.

ఇది ఇలా ఉండగా, అటు శెలవుపై సీఎస్ జవహర్ రెడ్డి.... వెళ్లారు. ఆయన మళ్లీ రావడం కష్టమేనని అంటున్నారు. దీంతో సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకం ఉంటుందట. అంతేకాదు.... రాజీనామా చేసినా.. చేయకున్నా.. సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆదేశించదట కొత్త సర్కార్‌. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందట ఆంధ్ర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం. ఇక అటు పీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో  డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేశారట.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>