PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-something-special-behind-the-victory-of-these-three-do-you-know6a090fd6-a686-4b61-b209-6c633112ffd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-something-special-behind-the-victory-of-these-three-do-you-know6a090fd6-a686-4b61-b209-6c633112ffd9-415x250-IndiaHerald.jpg( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) ఓట‌మి-గెలుపు అనేది రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణం. వీటిని స‌మ‌పాళ్ల‌లో చూడాలి. అయితే.. కొన్ని గెలుపులు.. కొన్ని ఓట‌ము ల వెనుక‌.. క‌సి ఉంటుంది. ఆ క‌సి.. తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇలాంటి స్ప‌ష్ట‌త చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉన్నా.. మూడు కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింత ఆస‌క్తి రేపింది. వాటిలో ఒక‌టి మంగ‌ళ‌గిరి. రెండు విశాఖ ఎంపీ, మూడు పిఠాపు రం. ఈ మూడు చోట్లా కూడా.. గెలిచిన వారు.. గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎలా సాధ్యAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; lokesh; barth{#}BOTCHA SATYANARAYANA;Amaravathi;pithapuram;Vishakapatnam;Nara Lokesh;India;YCP;Partyఈ ముగ్గురు గెలుపు వెన‌క ఓ స్పెష‌ల్ ఉంది... తెలుసా..!ఈ ముగ్గురు గెలుపు వెన‌క ఓ స్పెష‌ల్ ఉంది... తెలుసా..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; lokesh; barth{#}BOTCHA SATYANARAYANA;Amaravathi;pithapuram;Vishakapatnam;Nara Lokesh;India;YCP;PartyThu, 06 Jun 2024 13:43:06 GMT( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఓట‌మి-గెలుపు అనేది రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణం. వీటిని స‌మ‌పాళ్ల‌లో చూడాలి. అయితే.. కొన్ని గెలుపులు.. కొన్ని ఓట‌ము ల వెనుక‌.. క‌సి ఉంటుంది. ఆ క‌సి.. తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇలాంటి స్ప‌ష్ట‌త చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉన్నా.. మూడు కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింత ఆస‌క్తి రేపింది. వాటిలో ఒక‌టి మంగ‌ళ‌గిరి. రెండు విశాఖ ఎంపీ, మూడు పిఠాపు రం. ఈ మూడు చోట్లా కూడా.. గెలిచిన వారు.. గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎలా సాధ్య‌మైంది?  ఇప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ఎలా గెలిచారు? అనేది ఆస‌క్తిక‌రం.


మంగ‌ళ‌గిరి: 2019లో చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌.. ఇక్క‌డ తొలిసారిఅరంగేట్రం చేశారు. మంగ‌ళ‌గిరి ప్రాంతం రాజ‌ధానికి ద‌గ్గ‌ర‌లో ఉండ‌డంతో త‌న గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, ఆ ఎన్నిక‌ల‌లో ఓడిపోయారు.దీంతో తాజా ఎన్నిక‌ల్లో నియో జ‌క‌వ‌ర్గం మార్చుకుంటే బెట‌ర్ అనే సూచ‌న‌లు అన్ని వ‌ర్గాల‌నుంచి వినిపించింది. అంతేకాదు.. చంద్ర‌బాబు కూడా. నియోజ‌క వ‌ర్గం మార్చుకోవాల‌ని సూచించారు.  అయిన‌ప్ప‌టికీ..ప‌ట్టుబ‌ట్టి నారా లోకేష్ ఇక్క‌డే పోటికి దిగారు. గ‌త మూడేళ్లుగా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ఫ‌లితంగా క‌నీవినీ ఎరుగ‌ని 92 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు.


విశాఖ ఎంపీ: ఇక్క‌డ నంద‌మూరి కుటుంబం అల్లుడు.. మెతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ పోటీ చేసి ఓడిపోయారు. గ‌త 2019లో తొలిసారి ఆయ‌న ఇక్క‌డ అరంగేట్రం చేశారు. నంద‌మూరి అల్లుడిగా ఆయ‌న ప‌రిచ‌యం చేసుకున్నా.. తాత‌గారి ఇమేజ్‌ను వాడుకున్నా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. కానీ, గ‌త మూడేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డ‌తో న‌మ్మ‌కం పెంచుకున్నారు. ఇప్పుడు రాజ‌కీయంగా సీనియ‌ర్ అయిన‌.. బొత్స కుటుంబాన్ని ఎద‌రించి మ‌రీ నిలిచారు. 70 వేల‌కు పైగా ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు.


పిఠాపురం:  గ‌త 2019లో రెండు స్థానాల నుంచి పోటి చేసి ఓడిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అనేక ట్రోల్స్ వ‌చ్చాయి. అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి పార్టీ అధినేతే ఓడిపోయారంటూ.. వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు. వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. ఈ క‌సి.. ప‌ట్టుద‌ల‌గా మారి.. ప‌వ‌న్‌ను పిఠాపురం నుంచి పోటీచేసేలా చేసింది. అప్పుడు కూడా.. ఆయ‌న గెలుపుపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టుద‌ల‌, కృషితో ముందుకు సాగారు. ప‌లితంగా పిఠాపురంలో 70 వేల కుపైగా మెజారిటీ ద‌క్కించుకున్నారు. మొత్తంగా.. నాటి ఓట‌మి నుంచి వ‌చ్చిన క‌సి ప‌ట్టుద‌లగా మారి వీరు విజ‌యం ద‌క్కించుకున్నార‌న‌డంలో సందేహం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>