Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1a88ef62-4bde-4363-a579-64cc9213b307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1a88ef62-4bde-4363-a579-64cc9213b307-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో టైప్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను తీయడంలో శోభన్ బాబు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఫ్యామిలీ అభిమానులైతే శోభన్ బాబు సినిమా కోసం అమితంగా ఎదురుచూసేవారు. ఇక ఆయన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను తీయడంలో వెంకటేష్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఒకానొక సమయంలో వెంకటేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ అభిమానులందరూ థియేటర్ కి వెళ్లి మరి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. ఆ రకంగా కొన్ని సినిమాలను వెంకటేష్ మాsocialstars lifestyle{#}sobhan babu;Malliswari;Audience;cinema theater;anil ravipudi;Success;Hero;Father;Manam;Cinema;Venkatesh;Chiranjeeviవెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ రిపీట్ చేయగలరా..??వెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ రిపీట్ చేయగలరా..??socialstars lifestyle{#}sobhan babu;Malliswari;Audience;cinema theater;anil ravipudi;Success;Hero;Father;Manam;Cinema;Venkatesh;ChiranjeeviThu, 06 Jun 2024 17:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో టైప్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను తీయడంలో శోభన్ బాబు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఫ్యామిలీ అభిమానులైతే శోభన్ బాబు సినిమా కోసం అమితంగా ఎదురుచూసేవారు. ఇక ఆయన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను తీయడంలో వెంకటేష్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఒకానొక సమయంలో వెంకటేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ అభిమానులందరూ థియేటర్ కి వెళ్లి మరి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. ఆ రకంగా కొన్ని సినిమాలను వెంకటేష్ మాత్రమే చేయగలడు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సైతం తను చేసిన డాడీ సినిమాని వెంకటేష్ చేసుంటే సూపర్ సక్సెస్ అయి ఉండేది అంటూ ఓపెన్ గా చెప్పాడు. అంటే ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక వెంకటేష్ చేసిన సూర్యవంశం, రాజా, వసంతం, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన్ని స్టార్ హీరోగా మార్చడంలో కూడా చాలావరకు సహాయపడ్డాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి మాత్రం వెంకటేష్ కి ఫ్యామిలీ సబ్జెక్టులు అసలు కలిసి రావడం లేదు. సైంధవ్ సినిమాతో కూతురు సెంటిమెంట్ ను వర్కౌట్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.మరి ఇప్పుడు ఆయన మరోసారి ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? లేదంటే డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడా? అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన ఎలాంటి వివరణ సినిమా యూనిట్ ఇంకా రాలేదు. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>