PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-latest-news-jagan-chandrababu-pawan-kalyanb5f62cf8-752f-42a4-8927-4907c37d90e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-latest-news-jagan-chandrababu-pawan-kalyanb5f62cf8-752f-42a4-8927-4907c37d90e9-415x250-IndiaHerald.jpgఅపుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే.. ప్రజలకు ప్రభుత్వానికి వారధి మీడియా మాత్రమే. అలాంటి మీడియాను నాయకులు ఎలా వాడుకున్నారు అనేదాని బట్టే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఏమి అనుకుంటున్నారు? అనేటువంటి అభిప్రాయాలు మీడియా ద్వారానే ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది. మీడియా అంటే అద్దం లాంటిది. అదే వైసీపీ ఘోర పరాజయం వెనక బలమైన కారణమా అని ఇపుడు నిపుణులు చర్చిస్తున్నారు. జగన్ విషయానికొస్తే ఆయన మీడియాకు ఎక్కువగా దూరంగా ఉంటారు. కేవలం తన సొంత మీడియాలో తప్పితే బయట మీడియాలో ఆయన పెద్దగా కనబడిన దాఖలాలుap political latest news jagan chandrababu pawan kalyan{#}media;Yevaru;Telangana Chief Minister;Press;Jagan;YCP;Governmentప్రెస్ మీట్ పెట్టకపోవడానికి, జగన్ ఓడిపోవడానికి సంబంధం ఏమిటి?ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి, జగన్ ఓడిపోవడానికి సంబంధం ఏమిటి?ap political latest news jagan chandrababu pawan kalyan{#}media;Yevaru;Telangana Chief Minister;Press;Jagan;YCP;GovernmentThu, 06 Jun 2024 12:00:00 GMTఅపుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే.. ప్రజలకు ప్రభుత్వానికి వారధి మీడియా మాత్రమే. అలాంటి మీడియాను నాయకులు ఎలా వాడుకున్నారు అనేదాని బట్టే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఏమి అనుకుంటున్నారు? అనేటువంటి అభిప్రాయాలు మీడియా ద్వారానే ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది. మీడియా అంటే అద్దం లాంటిది. అదే వైసీపీ ఘోర పరాజయం వెనక బలమైన కారణమా అని ఇపుడు నిపుణులు చర్చిస్తున్నారు. జగన్ విషయానికొస్తే ఆయన మీడియాకు ఎక్కువగా దూరంగా ఉంటారు. కేవలం తన సొంత మీడియాలో తప్పితే బయట మీడియాలో ఆయన పెద్దగా కనబడిన దాఖలాలు లేవు.

అన్నింటికి మించి కోట్లాది మంది ప్రజలకు బాధ్యుడిగా కీలకమైన పదవిలో ఉన్న వారు ఖచ్చితంగా మీడియాతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అటువంటి మీడియాను జగన్ దూరం చేసుకొని ఓ సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కానీ ఫలితం శూన్యం. ఎందుకంటే అక్కడ పనిచేసింది డబ్బులు కోసం పని చేసిన సో కాల్డ్ ఉద్యోగులు మాత్రమే. వారు డబ్బులు కోసం పనిచేస్తారు తప్ప, వారికి జగన్ పైన ఎమోషన్ ఉంటుంది అనుకోవడం అమాయకత్వం. అదే జగన్ విషయంలో జరిగింది. పైగా సొంత పేపర్ చానల్ ఉన్న జగన్ మీడియాను దూరం పెట్టడంలో అర్ధమే లేదు.

అవును, గత అయిదేళ్ళలో జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వ అధినేతగా జగన్ తాను చేసిన మంచి పనులను చెప్పుకునేందుకు కూడా ఇతర మీడియాలను ఎక్కడా వాడుకున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేయకపోతే ఎవరు చేస్తారు? అదంతా ఒకెత్తయితే పాలనలో భాగం కానీ ఎన్నడూ ఎక్కడా లేని ఒక కొత్త వ్యవస్థ వాలంటీర్లను తీసుకుని వచ్చారు. వారి మీదనే జగన్ పూర్తిగా ఆధారపడి పోవడం కూడా నష్టపోయినట్టే. కానీ జీతానికి పనిచేసే వాలంటీర్లకు ప్రభుత్వం చేసే మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది? అన్నదే కీలకమైన ప్రశ్న. కాబట్టి మీడియాకు దూరంగా ఉంటూ ఏ విషయం చెప్పకుండా చేయడం కూడా జగన్ చేసిన అతి పెద్ద తప్పులలో అత్యంత పెద్దతప్పు అని విశ్లేషణలు బయటకు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>