PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nagababuecb2e3bf-c491-4a8b-828d-0975854e2c97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nagababuecb2e3bf-c491-4a8b-828d-0975854e2c97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈనెల 12వ తేదీన తెలుగుదేశం కూటమి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల కంటే ముందు జనసేన, తెలుగుదేశం అలాగే బిజెపి పార్టీలు.. జతకట్టి వైసిపి పార్టీని భూస్థాపితం చేశాయి. ఇక ఈ మూడు పార్టీలు ఏకమై ఏపీలో అధికారాన్ని కూడా చేపట్టబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే... డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. nagababu{#}Tirumala Tirupathi Devasthanam;Annayya;Pawan Kalyan;Parliment;Minister;News;Government;Bharatiya Janata Party;CBN;YCP;Telugu Desam Party;Andhra Pradesh;Janasena;kalyan;Partyజనసేన : టీటీడీ బోర్డు చైర్మన్ గా మెగా బ్రదర్‌ ?జనసేన : టీటీడీ బోర్డు చైర్మన్ గా మెగా బ్రదర్‌ ?nagababu{#}Tirumala Tirupathi Devasthanam;Annayya;Pawan Kalyan;Parliment;Minister;News;Government;Bharatiya Janata Party;CBN;YCP;Telugu Desam Party;Andhra Pradesh;Janasena;kalyan;PartyThu, 06 Jun 2024 16:39:41 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈనెల 12వ తేదీన తెలుగుదేశం కూటమి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల కంటే ముందు జనసేన, తెలుగుదేశం అలాగే బిజెపి పార్టీలు.. జతకట్టి వైసిపి పార్టీని భూస్థాపితం చేశాయి. ఇక ఈ మూడు పార్టీలు ఏకమై ఏపీలో అధికారాన్ని కూడా చేపట్టబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే... డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.


 అలాగే తక్కువ సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్... కూటమి విజయానికి కారణమయ్యాడని ఇప్పటికే చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా... మోడీతో చంద్రబాబును కల్పించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 50 సీట్లలో పోటీ చేయాల్సిన జనసేన పార్టీ... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం... 21 స్థానాలు తీసుకొని...  ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో...అని చేసి చూపించింది.తక్కువ సీట్లు తీసుకొని.. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు... పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు అని చెప్పవచ్చు.



 అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని.. తన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ముందుకు సాగుతున్నారట. కొత్తగా ఏర్పాటు అయ్యే మంత్రివర్గంలో... జనసేనకు ఆరు పదవులు వచ్చేలా చూస్తున్నారట. అలాగే తన అన్నయ్య నాగబాబుకు... టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పారట పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సీటు నాగబాబుకు... ఇవ్వలేదు కనుక... పార్టీ కోసం కష్టపడ్డ ఆయనకు  టిటిడి చైర్మన్ కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. గత పది సంవత్సరాలుగా.. తనతోనే ఉంటూ... జనసేన పార్టీకి ఆర్థికంగా  సహాయం చేశారు నాగబాబు. నిత్యం పవన్ కళ్యాణ్ తో తిరుగుతూ... వైసీపీకి కౌంటర్ ఇస్తూనే వచ్చారు.


అలాంటి నాగబాబు... మొన్నటి ఎన్నికల్లో సీటు రాకున్నా కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. దీంతో ఆయన సేవలు గుర్తించిన పవన్ కళ్యాణ్... టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు తో చర్చించారట. అటు జనసేన పార్టీ కోసం దశాబ్ద కాలంగా కష్టపడ్డ నేతలు అందరికీ న్యాయం జరిగేలా... చంద్రబాబుతో చర్చిస్తున్నారట పవన్ కళ్యాణ్. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్క నాయకుడికి... అన్యాయం జరగకుండా చూస్తున్నారట. దానికోసం తనకు మంత్రి పదవి రాకున్నా సరే కానీ.. గెలిచిన వారిలో ఎక్కువ మందికి మంత్రి పదవులు వచ్చేలా... రంగం సిద్ధం చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>