MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey70585f3d-d4c4-4950-92df-f21476e0dd69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey70585f3d-d4c4-4950-92df-f21476e0dd69-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి సైంధవ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం వెంకటేష్ వరుసగా మూడు ప్రాజెక్టు లలో నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ లు ఏవో తెలుసుకుందాం. వెంకటేష్ కొంత కాలం క్రితం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రvenkey{#}anil ravipudi;Makar Sakranti;F2;rana daggubati;anil music;Hero;Cinema;Venkateshవరుసగా మూడు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న వెంకీ..?వరుసగా మూడు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న వెంకీ..?venkey{#}anil ravipudi;Makar Sakranti;F2;rana daggubati;anil music;Hero;Cinema;VenkateshThu, 06 Jun 2024 13:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి సైంధవ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం వెంకటేష్ వరుసగా మూడు ప్రాజెక్టు లలో నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు.

ఆ ప్రాజెక్ట్ లు ఏవో తెలుసుకుందాం. వెంకటేష్ కొంత కాలం క్రితం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 మరియు సీజన్ 3 షూటింగ్ లు ఒకే సారి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2 , సీజన్ 3 షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న వెంకటేష్ ఈ రెండు వెబ్ సిరీస్ లతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

అందుకోసం ఈ మూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా అంతే వేగంగా పూర్తి చేసి ఈ మూవీ ని ఖచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇలా వెంకటేష్ రెండు వెబ్ సిరీస్ లు ఒక సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ఇది వరకే వెంకీ , అనిల్ కాంబో లో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే మూవీ లు రూపొంది మంచి విజయాలను అందుకున్నాయి. దానితో వీరి కాంబో లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>