PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna--chiranjeevie1e11180-3539-4219-8df3-335f54ffe96c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna--chiranjeevie1e11180-3539-4219-8df3-335f54ffe96c-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో బాలయ్య ఫుల్ ఫాంలో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ..తనకి తానే సాటి అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య అంటూ ఆయన పేరు మారుమోగిపోతోంది. సినిమా రంగంలో 60 ఏళ్ళ వయసులో కూడా 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని.. యంగ్ హీరోలకు సైతం గట్టి సవాల్ విసురుతున్నారు బాలయ్య.ప్Bala Krishna - Chiranjeevi{#}Hindupuram;Praja Rajyam;Rajani kanth;Dookudu;netizens;Hanu Raghavapudi;Congress;June;Bobby;Hero;Balakrishna;Chiranjeevi;Telugu Desam Party;Cinemaఆ విషయంలో బాలయ్య చిరు కంటే తోపే?ఆ విషయంలో బాలయ్య చిరు కంటే తోపే?Bala Krishna - Chiranjeevi{#}Hindupuram;Praja Rajyam;Rajani kanth;Dookudu;netizens;Hanu Raghavapudi;Congress;June;Bobby;Hero;Balakrishna;Chiranjeevi;Telugu Desam Party;CinemaThu, 06 Jun 2024 18:09:07 GMTసీనియర్ హీరో బాలయ్య ఫుల్ ఫాంలో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ..తనకి తానే సాటి అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య అంటూ ఆయన పేరు మారుమోగిపోతోంది. సినిమా రంగంలో 60 ఏళ్ళ వయసులో కూడా 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని.. యంగ్ హీరోలకు సైతం గట్టి సవాల్ విసురుతున్నారు బాలయ్య.ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ (NBK 109) సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకొని, వరుసగా నాలుగో విజయం సాధించడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు. ఈ సినిమా నుంచి సెకండ్ గ్లింప్స్ జూన్ 10 వ తేదీన విడుదల కానుంది.అయితే బాలయ్య కేవలం సినిమాల్లో మాత్రమే కాదండోయ్ రాజకీయాల్లో కూడా దూకుడు చూపిస్తున్నాడు.హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి తన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నటసింహం.. 2019 లో టీడీపీకి ఎదురుగాలి వీచినా కూడా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా హిందూపురంలో గెలుపు జెండాని ఎగురవేశారు.అది కూడా ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ రావడం విశేషం. 2014లో 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య.. 2019లో 18 వేల మెజారిటీతో, ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఏకంగా 32 వేల మెజారిటీతో బాలకృష్ణ గెలిచారు. ఈ విషయంలో బాలయ్య మెగాస్టార్ చిరంజీవి కంటే బెటర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా సూపర్ స్టార్ డం ఎంజాయ్ చేశాకా పీక్ స్టేజిలో ఉన్నప్పుడే సొంతంగా ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారి చివరికి రాజకీయాల్లో నిలబడలేక బయటకి వచ్చేశారు. ఆ కారణంగా చిరంజీవి క్రేజ్ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా అప్పటి క్రేజ్ మాత్రం లేదు.కానీ బాలయ్య మాత్రం అటు సినిమాల్లోనూ ఇటు పాలిటిక్స్ లోనూ తన క్రేజ్ ని స్టాండర్డ్ గా మైంటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో బాలయ్య చిరు కంటే తోపు అంటున్నారు నెటిజన్స్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>