PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-bandi-etela-rajendar-telangana-mdi-kcr8c1292f7-f718-4846-8431-279b5e7d7caa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-bandi-etela-rajendar-telangana-mdi-kcr8c1292f7-f718-4846-8431-279b5e7d7caa-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకధాటిగా రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్ పాలన చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వారు ఎన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఆ విధంగానే రెండు పర్యాయాలు కేసీఆర్ ను భరించారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత మూడోసారి ఆయనను నేలకేసి కొట్టారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అలా సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కూడా కొద్దికొద్దిగా పుంజుకుంటుంది.bjp;bandi;etela rajendar;telangana;mdi;kcr{#}Eatala Rajendar;Cheque;KCR;Leader;Telangana;Parliament;Hanu Raghavapudi;Congress;Party;CM;Election;Bharatiya Janata Party;Assemblyతెలంగాణ: "బండి" పని ఖతం..బీజేపీలో ఇక ఆయనే కీలకమా..?తెలంగాణ: "బండి" పని ఖతం..బీజేపీలో ఇక ఆయనే కీలకమా..?bjp;bandi;etela rajendar;telangana;mdi;kcr{#}Eatala Rajendar;Cheque;KCR;Leader;Telangana;Parliament;Hanu Raghavapudi;Congress;Party;CM;Election;Bharatiya Janata Party;AssemblyThu, 06 Jun 2024 11:24:33 GMT తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనేవి చాలా  ఆసక్తికరంగా ఉంటాయి.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకధాటిగా రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్  పాలన చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన  వారు ఎన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఆ విధంగానే రెండు పర్యాయాలు కేసీఆర్ ను భరించారు తెలంగాణ ప్రజలు.  ఆ తర్వాత మూడోసారి ఆయనను నేలకేసి కొట్టారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అలా సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కూడా కొద్దికొద్దిగా పుంజుకుంటుంది.

 2019 ఎన్నికల వరకు బిజెపి రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు.  ఎప్పుడైతే బండి సంజయ్ అధ్యక్ష బాధ్యత తీసుకున్నారో ఇక అప్పటినుంచి బిజెపి పుంజుకోవడం మొదలైంది. అలా కొన్నాళ్లపాటు బిజెపి హవాసాగింది. ఆ తర్వాత  రాష్ట్రంలో కీలక లీడర్ అయినటువంటి ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. ఆ తర్వాత బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. కిషన్ రెడ్డికి ఆ బాధ్యతను అప్పగించారు.  ఇదే తరుణంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. బిజెపి ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎనిమిది స్థానాల్లో  విజయ బాగుటా ఎగరవేసింది.  2024 పార్లమెంటులో కూడా కాంగ్రెస్ తో హోరాహోరీ పోరాడి  మరో ఎనిమిది పార్లమెంటు సీట్లు సాధించింది.

 ఇలా చాప కింద నీరులా బిజెపి రాష్ట్రంలో పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ బిజెపిలో చేరారో అప్పటినుంచి బండికి చెక్ పెట్టినట్టు అయింది. ఇదే తరుణంలో మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో బీజేపీలో ఆయన కీలక లీడర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.  ఒకవేళ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తే మాత్రం  నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బిజెపిని తిరుగులేని శక్తిగా తయారు చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడింది. ఆయన బీఆర్ఎస్ నుంచే వచ్చారు కాబట్టి తన పాత మిత్రులందరిని బిజెపికి తీసుకు వస్తారని, దానివల్ల రాష్ట్రంలో బిజెపి బలపడే అవకాశం ఉందని  సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>