PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-tdp-cbn-jagan-karnool-adonicb5452ae-070f-4ece-8016-b559110adc06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-tdp-cbn-jagan-karnool-adonicb5452ae-070f-4ece-8016-b559110adc06-415x250-IndiaHerald.jpgఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు వైసీపీ కంచుకోట కాగా ఈ ఎన్నికల ఫలితాలతో ఆ లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలల్లో 12 నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటగా కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే వైసీపీ సత్తా చాటింది. ఆలూరులో కూడా స్వల్ప మెజార్టీతోనే వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. kurnool{#}Rayalaseema;surya sivakumar;Backward Classes;Kurnool;Minister;YCP;News;Andhra Pradesh;CBN;Partyఉమ్మడి కర్నూలులో మంత్రి పదవి ఎవరికి... ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉందా?ఉమ్మడి కర్నూలులో మంత్రి పదవి ఎవరికి... ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉందా?kurnool{#}Rayalaseema;surya sivakumar;Backward Classes;Kurnool;Minister;YCP;News;Andhra Pradesh;CBN;PartyThu, 06 Jun 2024 09:30:00 GMTఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు వైసీపీ కంచుకోట కాగా ఈ ఎన్నికల ఫలితాలతో ఆ లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలల్లో 12 నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటగా కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే వైసీపీ సత్తా చాటింది. ఆలూరులో కూడా స్వల్ప మెజార్టీతోనే వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.
 
అయితే ఉమ్మడి కర్నూలులో మంత్రి పదవి ఎవరికి అనే ప్రశ్నకు మాత్రం షాకింగ్ సమాధానం వినిపిస్తోంది. డోన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి గెలిచిన బీసీ జనార్ధన్ రెడ్డిలలో ఎవరో ఒకరు మంత్రి పదవిని పొందే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు ఈ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.
 
మిగతా నియోజకవర్గాల నుంచి గెలిచిన అభ్యర్థులలో చాలామంది అభ్యర్థులు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులు కావడంతో వాళ్లకు మంత్రి పదవిపై ఆశలు లేవు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపు కోసం కూటమి నేతలు ఎంతో కష్టపడగా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఏపీ కేబినేట్ లోకి ఎవరిని తీసుకోవాలో ఇప్పటికే లిస్ట్ తయారైందని సమాచారం అందుతోంది.
 
వైసీపీ కంచుకోట అని పిలవబడే రాయలసీమలో పూర్తిస్థాయిలో లెక్కలు మార్చేసిన కూటమి ఐదేళ్లలో సుపరిపాలన అందిస్తే మాత్రం 2029 ఎన్నికల్లో కూడా తిరుగుండదని చెప్పవచ్చు. రాయలసీమ వాసులు ఎవరి పాలన బాగుంటుందని భావిస్తే వారికే ఓటేస్తారని టాక్ ఉంది. కూటమి పరిపాలనను బట్టి ఏపీ ఓటర్ల తీర్పు ఉండబోతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సీమలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కావడం ఆ పార్టీ నేతలకు సైతం ఎంతో షాకిచ్చిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>