PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/memes-on-jagand3d50136-257c-4caf-ae9a-e8ecbd8e668a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/memes-on-jagand3d50136-257c-4caf-ae9a-e8ecbd8e668a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో సోషల్ మీడియాకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేష్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విపరీతంగా విమర్శలు చేసే వారు. ముఖ్యంగా ఆ పార్టీ అభిమానులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేసే వారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా చతికిల పడింది. ఏకంగా రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ తరుపున గెలిచిన వారిలో చాలా మందికి భారీ మెజాmemes on jagan{#}Chiranjeevi;Friday;Gift;Tammudu;Thammudu;Jagan;MLA;Janasena;Party;Assembly;Bharatiya Janata Party;MP;TDP;media;CM;YCPజగన్‌పై సోషల్ మీడియాలో 'శుక్రవారం' మీమ్స్.. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో?జగన్‌పై సోషల్ మీడియాలో 'శుక్రవారం' మీమ్స్.. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో?memes on jagan{#}Chiranjeevi;Friday;Gift;Tammudu;Thammudu;Jagan;MLA;Janasena;Party;Assembly;Bharatiya Janata Party;MP;TDP;media;CM;YCPThu, 06 Jun 2024 14:47:15 GMTఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో సోషల్ మీడియాకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేష్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విపరీతంగా విమర్శలు చేసే వారు. ముఖ్యంగా ఆ పార్టీ అభిమానులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేసే వారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా చతికిల పడింది. ఏకంగా రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ తరుపున గెలిచిన వారిలో చాలా మందికి భారీ మెజారిటీ వచ్చింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కసిగా ఓటు వేసినట్లు వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న ఓటర్లంతా వచ్చారు. ఈ తరుణంలో 151 ఎమ్మెల్యే సీట్ల నుంచి వైసీపీ ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ పైనా, ఆ పార్టీ అధినేత జగన్ పైనా మీమ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

2014లో తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని టీడీపీ అక్రమంగా, పశువుల సంతల్లో పశువులను కొన్నట్టు కొన్నారని వైసీపీ ఆరోపించేది. అందుకే దేవుడు 2019లో టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చాడని అంతా పేర్కొనే వారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 ఎమ్మెల్యేలు గెలిచారు. వైసీపీకి 11 మాత్రమే గెలిచారు. కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 1+6+4 కలిపితే వచ్చే సంఖ్య కూడా 11 అవుతుంది. ఇదే కాకుండా వైసీపీ గతంలో 151 సీట్లు కాగా అటో ఇటో 1 ఎగిరి పోతుందనుకుంటే మధ్యలోని 5 ఎగిరిపోయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు  చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ మొత్తం జగన్‌కు చక్కటి గిఫ్ట్ ఇచ్చారని, తమకు రూ.5 చొప్పున ఇవ్వలేదని 151 మధ్యలో 5 ఎగురగొట్టేశారని పేర్కొంటున్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్ గత ఎన్నికల్లో అడిగారని, దీంతో ఆయనకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యలు వస్తున్నాయి. చిరంజీవి జగన్‌కు గతంలో దండం పెట్టారని, అయితే ఆయన తమ్ముడు పవన్ వైసీపీకి పిండం పెట్టారని పేర్కొంటున్నారు. అన్న వస్తున్నాడు.. చంచల్ గూడ జైలుకు అని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇక అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. తనకు అసెంబ్లీ ఉందని, సీఎంగా బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి ఆయన ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందేనని టీడీపీ, జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>