PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-news-politics-latest-peddireddy-jagan-mohan-reddy-tdp-chandrababu-pawankalyandd875be7-1151-4e05-9745-8b9a31fc222f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-news-politics-latest-peddireddy-jagan-mohan-reddy-tdp-chandrababu-pawankalyandd875be7-1151-4e05-9745-8b9a31fc222f-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఎదురులేని మహారాజులుగా ఫీలైపోయిన వైసీపీ నాయకులకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో సరియైన బుద్ధి చెప్పారు. పవర్ ఉన్నంత వరకే మీరు లీడర్లు, మా చేతికి ఒక్కసారి ఓటు అనే ఆయుధం ఇస్తే మీ తలరాతలు తల్లకిందులు చేస్తామని ఆంధ్రా ఓటర్లు మరోసారి నిరూపించారు. అవును, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో వైసీపీని మోకాళ్ళ కింద కూర్చోబెట్టారు ఓటర్లు. దాంతో వైసీపీ నాయకుల కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి... ఇంకా వారు తేరుకొని పరిస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కాదేమో!ap news politics latest peddireddy jagan mohan reddy tdp chandrababu pawankalyan{#}Culture;Punganur;Reddy;Minister;Andhra Pradesh;TDP;YCPపెద్దిరెడ్డికి ఇక చుక్కలే?పెద్దిరెడ్డికి ఇక చుక్కలే?ap news politics latest peddireddy jagan mohan reddy tdp chandrababu pawankalyan{#}Culture;Punganur;Reddy;Minister;Andhra Pradesh;TDP;YCPWed, 05 Jun 2024 17:25:09 GMTఆంధ్రాలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఎదురులేని మహారాజులుగా ఫీలైపోయిన వైసీపీ నాయకులకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో సరియైన బుద్ధి చెప్పారు. పవర్ ఉన్నంత వరకే మీరు లీడర్లు, మా చేతికి ఒక్కసారి ఓటు అనే ఆయుధం ఇస్తే మీ తలరాతలు తల్లకిందులు చేస్తామని ఆంధ్రా ఓటర్లు మరోసారి నిరూపించారు. అవును, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో వైసీపీని మోకాళ్ళ కింద కూర్చోబెట్టారు ఓటర్లు. దాంతో వైసీపీ నాయకుల కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి... ఇంకా వారు తేరుకొని పరిస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కాదేమో!

ఇక వైసీపీలో నాలుగైదు జిల్లాలో బలమైన నాయకుడిగా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పుంగనూరు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. విజయం వరించినప్పటికీ అది విజయమో లేదా హెచ్చరికో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలుపుపై అక్కడ మెజారిటీ ఊహించారు. అయితే ఓట్ల లెక్కింపు సందర్బంగా రౌండ్ రౌండ్ కీ పెద్దిరెడ్డి వర్గానికి జనాలు ఝలక్ ఇచ్చినట్లయింది. దాదాపు 6వ రౌండ్ పూర్తి అయ్యే సరికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి 33, 389 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి (చల్లా బాబు)కు 30, 700 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చల్లా రామచంద్రా రెడ్డి గట్టిపోటీ ఇవ్వడంతో ఆ విషయాన్ని పెద్దిరెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు.

అయితే కడకు కేవలం 6,095 ఓట్ల మెజారిటీతో బతికిబట్టకట్టగలిగాడు పెద్దిరెడ్డి. అది కూడా రౌడీయిజం పేరుతో సాధించిన ఓట్లేనని జనాలకి తెలియంది కాదు. ఎందుకంటే పెద్దిరెడ్డి అరాచకాలు గురించి అందరికీ తెలిసినదే. విపక్షాలని అత్యంత దారుణంగా భయపెట్టి, బెదిరించి, అవసరమైతే హింసించి తన ఈగోని చల్లార్చుకొనే పెద్దిరెడ్డి నీచ సంస్కృతి గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి రాష్ట్ర ప్రజలు కూటమికి విజయం పట్టం కట్టడంతో పెద్దిరెడ్డి బేస్ కదులుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ముందేం జరుగుతుందో అని ఇప్పటినుండే హడలెత్తిపుతున్నారట పెద్దిరెడ్డి వర్గీయులు!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>