Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled7153e58-04ec-4902-80fa-2e1f2dc0ea8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled7153e58-04ec-4902-80fa-2e1f2dc0ea8e-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది కాజల్ .60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో "సత్యభామ"గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. "మేజర్" చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవsocialstars lifestyle{#}Ram Charan Teja;naveen chandra;Moon;Bobby;Traffic police;Darsakudu;rashmika mandanna;Audience;Thikka;Thriller;Satyabhama;kajal aggarwal;Director;Tollywood;Heroine;Cinemaమా ఆయనకు ఆ ఇద్దరు చాలా ఇష్టం అంటున్న చందమామ..!!మా ఆయనకు ఆ ఇద్దరు చాలా ఇష్టం అంటున్న చందమామ..!!socialstars lifestyle{#}Ram Charan Teja;naveen chandra;Moon;Bobby;Traffic police;Darsakudu;rashmika mandanna;Audience;Thikka;Thriller;Satyabhama;kajal aggarwal;Director;Tollywood;Heroine;CinemaWed, 05 Jun 2024 18:35:00 GMTసౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది కాజల్ .60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో "సత్యభామ"గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. "మేజర్" చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న "సత్యభామ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలు తెలిపింది కాజల్ అగర్వాల్."సత్యభామ" మూవీ నా పర్సనల్ లైఫ్ తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా ..నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా..ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తుంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి.

నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్ కు కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు.నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రష్మిక మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్ అంటూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు కాజల్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>