MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/thamanna--raashi-khannaa6e3ba08-e782-4503-bad0-71c963eaf491-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/thamanna--raashi-khannaa6e3ba08-e782-4503-bad0-71c963eaf491-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటిదాకా చెక్కు చెదరని అందంతో మంచి ఫాంలో ఉంది. మరీ స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటుంది. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తమిళ సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ అయిన అరణ్మనై 4 లో రాశి ఖన్నా తో కలిసి తమన్నా స్క్రీన్‌ షేర్‌ చేసుకొని ఆ సినిమాతో 100 కోట్ల హిట్టు కొట్టింది.ఆ మూవీలో మరో హాట్ బ్యూటీ అయినా రాశి ఖన్నా తో కలిసి వర్క్ చేయడం పై మిల్కీ బ్యూటీ స్పందించింది. సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించడం వల్ల ఏదో ఒక విషThamanna - Raashi Khanna{#}raasi;Rashi Khanna;tamannaah bhatia;Audience;Heroine;Telugu;Tamil;Blockbuster hit;BEAUTY;News;Cinemaఅరణ్మనై 4: రాశీఖన్నాతో సమస్య? తమన్నా ఏమన్నదంటే?అరణ్మనై 4: రాశీఖన్నాతో సమస్య? తమన్నా ఏమన్నదంటే?Thamanna - Raashi Khanna{#}raasi;Rashi Khanna;tamannaah bhatia;Audience;Heroine;Telugu;Tamil;Blockbuster hit;BEAUTY;News;CinemaWed, 05 Jun 2024 20:13:18 GMTమిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటిదాకా చెక్కు చెదరని అందంతో మంచి ఫాంలో ఉంది. మరీ స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటుంది. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తమిళ సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ అయిన అరణ్మనై 4 లో రాశి ఖన్నా తో కలిసి తమన్నా స్క్రీన్‌ షేర్‌ చేసుకొని ఆ సినిమాతో 100 కోట్ల హిట్టు కొట్టింది.ఆ మూవీలో మరో హాట్ బ్యూటీ అయినా రాశి ఖన్నా తో కలిసి వర్క్ చేయడం పై మిల్కీ బ్యూటీ స్పందించింది. సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించడం వల్ల ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. కానీ తమన్నాకి మాత్రం రాశి ఖన్నా తో ఎలాంటి సమస్య రాలేదు అంటూ తాజా ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ  చెప్పుకొచ్చింది. ఇంకా తమన్నా మాట్లాడుతూ... ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రేక్షకులు వారి ఇద్దరి నటనను, గ్లామర్ ని పోల్చుతూ చూస్తారు. అలా పోలిక ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందు నుంచి ఇద్దరం కూడా చాలా కష్టపడి పని చేశాం. ఒకరికొకరం కూడా చర్చించుకుంటూ నటించాం.


మా ఇద్దరిలో కూడా బాగా నటించాలనే తపన పెరిగింది. అరణ్మనై లో నేను, రాశి కలిసి ఒక పాటలో కనిపించాం. ఆ పాటలోని డాన్స్ స్టెప్స్ ను పోటా పోటీగా వేసేందుకు బాగా ప్రయత్నించాం. అందుకే ఇద్దరి కాంబోకు కూడా చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇంకా అంతే కాకుండా మా సినిమా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుందని తమన్నా అంది.ఇప్పటి దాకా వచ్చిన అరణ్మనై నాలుగు పార్ట్‌ లు కూడా మంచి విజయలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ లో అయిదవ భాగం కూడా అతి త్వరలోనే మొదలు పెట్టే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. తెలుగు లో అరణ్మనై సినిమాను 'బాక్‌' గా విడుదల చేశారు. కానీ అట్టర్ ప్లాప్ అయ్యి అడ్రెస్ లేకుండా పోయింది.అయితే టాలీవుడ్‌ కి చెందిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల కారణంగా బాక్ కి మంచి పబ్లిసిటీ దక్కి అచ్చో పాట మాత్రం బాగా హిట్ అయింది. కానీ వసూళ్ల విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని లైట్‌ తీసుకున్నారు.అయితే తమిళనాట మాత్రం ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>