MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1308a71b-6c4d-4e69-a1de-94782e895ef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1308a71b-6c4d-4e69-a1de-94782e895ef6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సత్యభామ. లేడీ ఓరియంటెడ్ కథతో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా సుమన్ చిక్కాల దర్శకత్వంలో రాబోతోంది. క్షణం గూడాచారి వంటి భారీ విజయాలను అందుకున్న శశికిరణ్ తిక్క నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. కాగా సోషల్ మీడియాలో టీజర్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రాగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే tollywood{#}prasad;Thriller;Thikka;Satyabhama;Kshanam;June;kajal aggarwal;Hyderabad;Heroine;Tollywood;Cinemaబంపర్ ఆఫర్ ఇచ్చిన సత్యభామ మూవీ టీం.. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే..!?బంపర్ ఆఫర్ ఇచ్చిన సత్యభామ మూవీ టీం.. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే..!?tollywood{#}prasad;Thriller;Thikka;Satyabhama;Kshanam;June;kajal aggarwal;Hyderabad;Heroine;Tollywood;CinemaWed, 05 Jun 2024 17:10:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సత్యభామ. లేడీ ఓరియంటెడ్ కథతో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా సుమన్ చిక్కాల దర్శకత్వంలో రాబోతోంది. క్షణం గూడాచారి వంటి భారీ విజయాలను అందుకున్న శశికిరణ్ తిక్క నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. కాగా సోషల్ మీడియాలో టీజర్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రాగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు.

 ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా చూసే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మేకర్స్. అది కూడా కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. అయితే జూన్ 7న సత్యభామ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు అంటే జూన్ 5న హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక ఆ ప్రీమియర్స్ కి హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా రాబోతున్నారు. అయితే షో కి ఆడవాళ్ళకి ఎంట్రీ ఫ్రీ గా ఉంటుంది

 అంటూ తాజాగా ప్రకటించారు మేకర్స్. ఫ్రీ టికెట్ పొందడానికి కేవలం మీ మొబైల్ లో షీ సేఫ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌ టికెట్ కౌంటర్ లో షీ సేఫ్ ఇన్స్టాల్ చేసినట్టుగా చూపించి టికెట్ తీసుకోవచ్చు. అలా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  సత్యభామ సినిమాను కాజల్ తో కలిసి చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. మరి ఎందుకు ఆలస్యం.. మీ మొబైల్ లో షీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసి సత్యభామ సినిమా చూసేయండి... దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>