PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/evm-hindupur-mistake-tdp-balakrishna-ap-ycp-tdp07b2dd9d-dfc4-4deb-b4f0-2d15713d5893-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/evm-hindupur-mistake-tdp-balakrishna-ap-ycp-tdp07b2dd9d-dfc4-4deb-b4f0-2d15713d5893-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఊహలకందని రిజల్ట్స్ వచ్చాయి. నిజానికి టిడిపి కూటమి కూడా ఈ విధంగా రిజల్ట్ వస్తుందని కూడా ఊహించలేదనుకోండి. అలాగే ఓడిపోయిన వైసీపీ కూడా ఈ విధమైన పరాభవం ఎదురవుతుందని ఊహించలేదట. రిజల్ట్ చూస్తే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. మేము ఇంతమందిని కలిసి ఓట్లు వేశాం కదా, ఇంత మంచిగా ఓటింగ్ జరిగింది కదా, ఎందుకు ఇలా జరిగిందని విపరీతంగా అనుమాన పడుతున్నారట. ఈ క్రమంలోనే వారి అనుమానాలను నిజం చేస్తూ ఒక సంఘటన జరిగింది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానిevm;hindupur ;mistake;tdp;balakrishna;ap;ycp;tdp{#}Scheduled caste;Hindupuram;Nijam;Parliment;YCP;Andhra Pradesh;media;TDP;Newsఏపీ: ఈవీఎంలే మార్చేశారా.. ఇందులో నిజమెంతా.?ఏపీ: ఈవీఎంలే మార్చేశారా.. ఇందులో నిజమెంతా.?evm;hindupur ;mistake;tdp;balakrishna;ap;ycp;tdp{#}Scheduled caste;Hindupuram;Nijam;Parliment;YCP;Andhra Pradesh;media;TDP;NewsWed, 05 Jun 2024 12:59:00 GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎవరికి ఊహలకందని రిజల్ట్స్ వచ్చాయి. నిజానికి టిడిపి కూటమి కూడా ఈ విధంగా  రిజల్ట్ వస్తుందని కూడా ఊహించలేదనుకోండి. అలాగే ఓడిపోయిన వైసీపీ కూడా ఈ విధమైన పరాభవం ఎదురవుతుందని  ఊహించలేదట. రిజల్ట్ చూస్తే మాత్రం అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. మేము ఇంతమందిని కలిసి ఓట్లు వేశాం కదా, ఇంత మంచిగా ఓటింగ్ జరిగింది కదా, ఎందుకు ఇలా జరిగిందని విపరీతంగా అనుమాన పడుతున్నారట. ఈ క్రమంలోనే వారి అనుమానాలను నిజం చేస్తూ ఒక సంఘటన  జరిగింది.  హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈవీఎంను మార్చేశారు.

  మడకశిర ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన   ఈవీఎంలను  ఒక రూమ్లో పార్లమెంట్, మరో రూములో అసెంబ్లీకి సంబంధించిన ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని  పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూతు ఈవీఎం తీసుకొని వచ్చారు. దాన్ని తీసి లెక్కపెడితే బీఎస్పీకి  414 ఓట్లు ఉన్నాయి, టిడిపికి 349 ఓట్లు ఉన్నాయి. వైసిపి కేవలం 4 మాత్రమే పడ్డాయి.  ఈ బూతులో వైసీపీకి నాలుగు రావడం అంటే ఆశ్చర్యం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తారట.  దీంతో అధికారులు ఆ ఈవీఎం పక్కన పెట్టి మిగతావి లెక్కిస్తామని చెప్పారట. చివరికి అక్కడ 285 ఓట్లతో టిడిపికి మెజారిటీ వచ్చింది. చివరికి వైసీపీ అభ్యర్థి పక్కన పెట్టిన ఈవీఎం పరిస్థితి ఏంటి అని గట్టిగా అడగడంతో దానిని కూడా తీసుకువచ్చారు.

తీరా దాన్ని నిశితంగా గమనిస్తే అది పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం. ఇది పార్లమెంట్ కదా అని అడిగితే, ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించిన ఏవీఎం తీసుకువచ్చారట. కానీ అది ఓపెన్ చేస్తే ఓపెన్ కూడా కాలేదట. దీంతో వివి ప్లాట్ లెక్కించారట. దీంతో వైసిపికి 414, టిడిపికి 340 చిల్లర వచ్చాయట. ఇక్కడ 74 చిల్లర తేడాతో టిడిపి గెలిచినట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్లమెంట్ ఈవీఎం లెక్కిస్తే ఐదు పడితే  అసెంబ్లీకి వచ్చేసరికి 400 ఎలా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం చాలామందికి అనుమానం కలుగుతుంది. ఈ ఒక్క హిందూపూర్ లోనే ఇలా ఉంటే, ఏజెంట్ కరెక్ట్ గా లేని దగ్గర ఎలాంటి మిస్టేక్స్ జరిగాయో  అని వైసిపి నాయకులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>