PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jdu224fa230-c9cf-45c6-84af-3ef8d0bc7498-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jdu224fa230-c9cf-45c6-84af-3ef8d0bc7498-415x250-IndiaHerald.jpgదేశ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమికి అనుకున్న స్థాయిలో..... ఎంపి స్థానాలు రాకపోవడంతో... అసలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అటు ఇండియా కూటమి భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, శరత్ పవర్, నితీష్ కుమార్ లాంటి కీలక నేతలతో ట్రబుల్ షూటర్ శివకుమార్ చర్చలు నిర్వహిస్తున్నారట. jdu{#}sharath;Sharrath Marar;Kumaar;Siva Kumar;Nitish Kumar;News;MP;India;CBN;Government;Prime Minister;Bharatiya Janata Partyఎన్డీఏలో లుకలుకలు... కాబోయే ప్రధాని నితీష్ కుమార్.. ?ఎన్డీఏలో లుకలుకలు... కాబోయే ప్రధాని నితీష్ కుమార్.. ?jdu{#}sharath;Sharrath Marar;Kumaar;Siva Kumar;Nitish Kumar;News;MP;India;CBN;Government;Prime Minister;Bharatiya Janata PartyTue, 04 Jun 2024 18:40:50 GMTదేశ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమికి అనుకున్న స్థాయిలో..... ఎంపి స్థానాలు రాకపోవడంతో... అసలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అటు ఇండియా కూటమి భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, శరత్ పవర్, నితీష్ కుమార్ లాంటి కీలక నేతలతో ట్రబుల్ షూటర్ శివకుమార్ చర్చలు నిర్వహిస్తున్నారట.

 ఇలాంటి నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రధాని కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. నారా చంద్రబాబు నాయుడు,  నితీష్ కుమార్ అలాగే ఇతర కొన్ని పార్టీలు కలిస్తేనే కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో నితీష్ కుమార్ పార్టీకి చెందిన...  ఓ ఎమ్మెల్సీ ఖలీల్ అన్వర్  సంచలన ప్రకటన చేశాడు.

 భారతదేశానికి తదుపరి ప్రధాని నరేంద్ర మోడీ కాదని... ప్రధాని కాబోయేది నితీష్ కుమార్ అంటూ... ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఖలీద్ అన్వర్ తెలిపారు. నితీష్ కుమార్ కంటే మెరుగైన ప్రధాని అభ్యర్థి ఎక్కడ దొరుకుతాడు అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. భారతదేశాన్ని అర్థం చేసుకున్న అనుభవజ్ఞుడైన రాజకీయ నేత నితీష్ కుమార్ మాత్రమేనని తెలిపారు. అలాంటి నేత దేశ ప్రధాని అవుతే బాగుంటుందని అన్వర్ అభిప్రాయం తెలిపాడు.

 అంతేకాకుండా నితీష్ కుమార్ అన్ని ప్రజాస్వామ్య సంస్థలను గౌరవిస్తాడని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము ఎన్డీఏ కూటమిలో... భాగం అయ్యాం... కానీ అంతకుముందు  నుంచే నితీష్ కుమార్ ప్రధాని కావాలని చాలామంది కోరుతూనే వచ్చారు అని తెలిపారు. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రధాని నితీష్ కుమార్ అనే డిమాండ్ తెరపైకి వస్తోందని.. అందులో ఎలాంటి తప్పు లేదన్నాడు ఎమ్మెల్సీ అన్వర్. అయితే నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అన్వర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>