PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sree-bharathdfed21ae-fd15-450d-b770-81c0c17cecce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sree-bharathdfed21ae-fd15-450d-b770-81c0c17cecce-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన పార్లమెంటు నియోజకవర్గాల్లో విశాఖపట్నం లోక్ సభ సీటు కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ మూడు రాజధానుల ప్రకటన తర్వాత మారిన పరిస్ధితులు, వైసీపీపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, శాంతిభద్రతలు, సంక్షేమం, కుల సమీకరణాలు ఇలా చాలా అంశాలు ఈసారి విశాఖ తీర్పులో చాలా అంటే చాలా కీలకంగా మారాయి.విశాఖ పార్లమెంట్ సీటులో గత ఎన్నికలకూ, ఈసారి ఎన్నికలకూ రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలిలో చాలా సులభంగా విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకున్న వైసీపీ, ఆ తర్వాత మూడు రాజధానుల్లSree Bharath{#}bharath;Sri Bharath;Bank;Balakrishna;Minister;history;politics;Vishakapatnam;Parliament;Janasena;Parliment;Assembly;TDP;YCPవిశాఖ - పార్లమెంట్: బాలయ్య అల్లుడా మజాకా! భరత్ అదరగొట్టేశాడు!విశాఖ - పార్లమెంట్: బాలయ్య అల్లుడా మజాకా! భరత్ అదరగొట్టేశాడు!Sree Bharath{#}bharath;Sri Bharath;Bank;Balakrishna;Minister;history;politics;Vishakapatnam;Parliament;Janasena;Parliment;Assembly;TDP;YCPTue, 04 Jun 2024 22:46:00 GMTవైసీపీ మూడు రాజధానుల ప్రకటన తర్వాత మారిన పరిస్ధితులు, వైసీపీపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, శాంతిభద్రతలు, సంక్షేమం, కుల సమీకరణాలు ఇలా చాలా అంశాలు ఈసారి విశాఖ తీర్పులో చాలా అంటే చాలా కీలకంగా మారాయి.విశాఖ పార్లమెంట్ సీటులో గత ఎన్నికలకూ, ఈసారి ఎన్నికలకూ రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలిలో చాలా సులభంగా విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకున్న వైసీపీ, ఆ తర్వాత మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను అసలు రాజధానిగా చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇక్కడ ఆ పార్టీకి పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. అయితే దీన్ని కొనసాగించడంలో వైసీపీ విఫలమైందన్న వాదన కూడా గట్టిగా వినిపించింది. ముఖ్యంగా భూకబ్జాలతో వైసీపీ నేతలు చేసిన హంగామా స్థానికుల్లో చాలా రకాల విమర్శలకు కారణమైంది. వైసీపీ తరఫున విశాఖ నుంచి పోటీ చేసేందుకు స్ట్రాంగ్ అభ్యర్ధులెవరూ దొరక్కపోవడంతో విజయనగరానికి చెందిన మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మిని తీసుకురావడం జరిగింది. 


ఆమె మహిళా అభ్యర్ధి కావడం, విద్యావంతురాలు కావడం, వైసీపీ సంక్షేమ పథకాల బలం వంటివి ఆమెను గెలిపిస్తాయని వైసీపీ ఎన్నో ఆశలే పెట్టుకుంది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకోలేకపోవడం, నగరంలో స్థానికంగా కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీ ఇంకా జనసేనలోకి వెళ్లిపోవడం వంటి పరిణామాలు ఝాన్సీకి పెద్ద మైనస్ గా మారాయి.ఇంకా అదే సమయంలో పూర్తిగా అర్బన్ పరిధిలో ఉన్న విశాఖ లోక్ సభ ఓటు బ్యాంక్ టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమికి బాగా కలిసి వచ్చింది.ఇంకా అలాగే నగరంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుండటం, గతంలో వైసీపీ వేవ్ లో కూడా నగరంలో టీడీపీ సత్తా చాటుకున్న చరిత్ర కూటమికి ప్లస్ అయ్యాయి. ఇంకా అలాగే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి టీడీపీ అభ్యర్ధి మతుకుమిల్లి భరత్ కు బాగా కలిసి వచ్చాయి.గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్ యువకుడు, విద్యావంతుడు కావడం, క్లీన్ ఇమేజ్ ఈసారి ఆయన ఏకంగా 907467 ఓట్లు గెలిచి వైసీపీని చిత్తు చేశాడు. బొత్సా  ఝాన్సీ 403220     ఓట్లు మాత్రమే గెలిచి ఓడిపోయింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>