PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsaa244742-bd8e-478e-ac7f-01fe9f6c030b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsaa244742-bd8e-478e-ac7f-01fe9f6c030b-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలు మే 13న 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు మంచి హోరాహోరీ పోటీ మధ్య జరిగాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నుండి టిడిపి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తరఫున నెల్లూరు అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగారు.నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. రాళ్ల దాడులు, హాహాకారాలు.. ఏకంగా అభ్యర్థుల మasembly elections{#}anil music;Lavu Sri Krishna Devarayalu;District;Backward Classes;Nellore;Government;TDP;local language;narasaraopet;YCP;P Anil Kumar Yadav;anil kumar singhal;Sattenapalle;Fidaa;Indian Postal Service;Assembly;Party;Electionsనరసరావుపేట పార్లమెంట్ : 'సైకిల్' పై దూసుకుతున్న కృష్ణదేవరాయలు ...!నరసరావుపేట పార్లమెంట్ : 'సైకిల్' పై దూసుకుతున్న కృష్ణదేవరాయలు ...!asembly elections{#}anil music;Lavu Sri Krishna Devarayalu;District;Backward Classes;Nellore;Government;TDP;local language;narasaraopet;YCP;P Anil Kumar Yadav;anil kumar singhal;Sattenapalle;Fidaa;Indian Postal Service;Assembly;Party;ElectionsTue, 04 Jun 2024 08:55:11 GMTఏపీలో ఎన్నికలు మే 13న 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు మంచి హోరాహోరీ పోటీ మధ్య జరిగాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నుండి టిడిపి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తరఫున నెల్లూరు అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగారు.నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. రాళ్ల దాడులు, హాహాకారాలు.. ఏకంగా అభ్యర్థుల మీద దాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పటిదాకా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు లావు కృష్ణదేవయరాలు, అనిల్ కుమార్‌ మాత్రం గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు, అభివృద్ధిని వైసీపీ జనాల ముందు పెట్టింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి తాను నిత్యం జనాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నానని జరిగిన అభివృద్ధిలో అగ్రభాగం తనదేనని చెప్పుకున్నారు. లోకల్ సెంటిమెంట్‌ కూడా రగిలించారు.పల్నాడు జిల్లాలో మొదటిసారి బీసీ అభ్యర్థికి ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన అధికార పార్టీని జనాలు అదరిస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌కు పల్నాడు ఓటర్లు పట్టం కడతారా లేదంటే టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవయరాలు చెప్పిన మాటలకు పల్నాడు జనాలు ఫిదా అవుతారా అనేది నేటి ఫలితాలతో తేలనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుకు ఓటర్లు కట్టబోతున్న పట్టాభిషేకం అని అధికార పార్టీ భావించింది.దాంట్లో భాగంగానే మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పైన టిడిపి అభ్యర్థి కృష్ణదేవరాయలు ఆధిక్యతతో దూసుకుపోతున్నారు.ఇలానే కనక మిగిలిన రౌండ్లో జరిగితే లావు గెలుపు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>