PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jana-sena-s-balaraju-who-won-the-seat-without-hope-for-anyone29598198-83b3-4268-a568-43580cfa4d6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jana-sena-s-balaraju-who-won-the-seat-without-hope-for-anyone29598198-83b3-4268-a568-43580cfa4d6d-415x250-IndiaHerald.jpgఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం పోలవరం. పోలవరం పేరు చెబితే ఎంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు.. ఈ నియోజకవర్గంలోనే విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. నియోజకవర్గంలో మొత్తం పోలవరం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టీ నర్సాపురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉన్నాయి. వైశాల్య పరంగా అతిపెద్ద నియోజకవర్గం గా ఉన్న పోలవరంలో.. ఈ సాAP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024;polavaram MLA Cherry balaraju{#}rajya lakshmi;Wife;war;polavaram;Polavaram Project;Telangana;MLA;YCP;Telugu Desam Party;Janasenaపోల‌వ‌రం : ఎవ్వ‌రికి ఆశల్లేని సీట్లో గెలిచిన జ‌న‌సేన బాల‌రాజు... టెన్ష‌న్ పెట్టించావ్ బాసు..!పోల‌వ‌రం : ఎవ్వ‌రికి ఆశల్లేని సీట్లో గెలిచిన జ‌న‌సేన బాల‌రాజు... టెన్ష‌న్ పెట్టించావ్ బాసు..!AP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024;polavaram MLA Cherry balaraju{#}rajya lakshmi;Wife;war;polavaram;Polavaram Project;Telangana;MLA;YCP;Telugu Desam Party;JanasenaTue, 04 Jun 2024 19:45:21 GMTఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం పోలవరం. పోలవరం పేరు చెబితే ఎంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు.. ఈ నియోజకవర్గంలోనే విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. నియోజకవర్గంలో మొత్తం పోలవరం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టీ నర్సాపురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉన్నాయి. వైశాల్య పరంగా అతిపెద్ద నియోజకవర్గం గా ఉన్న పోలవరంలో.. ఈ సారి ఆసక్తికర పోరు జరిగుతుంద‌నుకున్నా పోలింగ్ కు ముందే వార్ వ‌న్‌సైడే అన్న టాక్ వ‌చ్చేసింది.


ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత తెల్లం బాలరాజును కాదని.. ఆయన స్థానంలో ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తెల్లం రాజ్యలక్ష్మికి వైసీపీ అవకాశం ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అవకాశం ఇచ్చిన ఏకైక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి కావటం విశేషం. ఇక కూటమి పొత్తులో భాగంగా పోలవరం స్థానాన్ని జనసేనకు కేటాయించారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి కేవలం 13 వేల ఓట్ల తెచ్చుకున్న చిర్రి బాలరాజుకు ఇక్కడ అవకాశం దక్కింది.


అయితే ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ఈ సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగినప్పటి నుంచి కచ్చితంగా ఇది వైసీపీ ఖాతాలోకే అన్న ప్రచారం ఎక్కువగా వినిపించింది. పలు సర్వేలు.. నివేదికలు అంచనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జనసేనకు ఎంతవరకు ? సహకరిస్తుంది అన్న సందేహాలు కూడా పోలవరంలో గట్టిగా నడిచాయి. ఈ రోజు కౌంటింగ్‌లో జ‌న‌సేన బాల‌రాజు బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి ప‌డేశాడు. ఏకంగా ఓడిపోతుంద‌నుకున్న సీటులో 7935 సీట్ల మెజార్టీతో గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. అలా ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం సీటు జ‌న‌సే న ఖాతాలో ప‌డింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>