Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-7cfe22a4-6972-4f20-896d-4e4e00729216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-7cfe22a4-6972-4f20-896d-4e4e00729216-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రజలందరికీ హార్ట్ బీట్ అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే అందరూ వేచి చూసిన రోజు రానే వచ్చింది. మే 13వ తేదీన తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఇక తాము గెలిపించుకోవాలి అనుకున్న అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చేశారు. ఈ క్రమంలోనే ఎవరు ఎటువైపుకు ఓటు వేశారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారో అన్న విషయం ఇక నేడు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై అందరిలో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారి పార్లమెంట్ ఎన్Election {#}Heart;local language;MLA;MP;Yevaru;Telangana;Bharatiya Janata Party;Parliment;Congressఎన్నికల కౌంటింగ్ : ఓడిపోయినా.. వీళ్లు పదవిలోనే?ఎన్నికల కౌంటింగ్ : ఓడిపోయినా.. వీళ్లు పదవిలోనే?Election {#}Heart;local language;MLA;MP;Yevaru;Telangana;Bharatiya Janata Party;Parliment;CongressTue, 04 Jun 2024 08:00:00 GMTతెలంగాణ ప్రజలందరికీ హార్ట్ బీట్ అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే అందరూ వేచి చూసిన రోజు రానే వచ్చింది. మే 13వ తేదీన తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఇక తాము గెలిపించుకోవాలి అనుకున్న అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చేశారు. ఈ క్రమంలోనే ఎవరు ఎటువైపుకు ఓటు వేశారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారో అన్న విషయం ఇక నేడు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై అందరిలో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అటు ప్రధాన పోటీదారులుగా ఉన్న బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఎందుకంటే అటు రాష్ట్రంలో రెండు సార్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే సికింద్రాబాద్లో బిజెపి విజయం సాధించింది. ఇక ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఇక అప్పుడు బిఆర్ఎస్ లాగానే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నం కాబట్టి ఇక్కడ మేమే గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఓటర్లు ఎప్పుడు భిన్నమైన తీర్పును ఇస్తూ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కూడా మరోసారి సికింద్రాబాద్లో  బిజెపి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంచనా వేశారు నిపుణులు.



 అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నేటి జరగబోయే కౌంటింగ్లో అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ  పదవిలోనే కొనసాగుతారు. ఎలా అంటే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్లమెంట్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ నుంచి లోకల్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. అయితే ఎంపీ పదవిని ఈ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. ఒకవేళ ఇద్దరు ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతారు అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>