PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-commissioncd48fd67-26d5-4459-b9c1-f9acc9b3bbbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-commissioncd48fd67-26d5-4459-b9c1-f9acc9b3bbbb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అసెంబ్లీ, లోక్‌సభ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. దాంతో పోలీసు అధికారులు చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రతిచోట కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారుల కోరిక మేరకు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 67 కంపెనీల కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. election commission{#}vehicles;deepak;WhatsApp;Traffic police;Red;central government;police;News;Andhra Pradesh;Loksabhaఏపీలో కట్టుదిట్టమైన భద్రత.. ఒక్క గొడవ జరిగినా సీన్ సితారే..ఏపీలో కట్టుదిట్టమైన భద్రత.. ఒక్క గొడవ జరిగినా సీన్ సితారే..election commission{#}vehicles;deepak;WhatsApp;Traffic police;Red;central government;police;News;Andhra Pradesh;LoksabhaTue, 04 Jun 2024 08:09:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అసెంబ్లీ, లోక్‌సభ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. దాంతో పోలీసు అధికారులు చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రతిచోట కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారుల కోరిక మేరకు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 67 కంపెనీల కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి.

మరోవైపు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల అన్ని ఏరియాలలో కూడా రెడ్ జోన్ 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో మొత్తం 1,985 సున్నిత ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది అక్కడ భద్రతను మరింత పెంచామని వెల్లడించింది. ఇకపోతే ఇప్పటికే 12,000 మందిపై బైండోవర్ కేసులు ఫైల్ అయ్యాయి.

 అయితే గొడవలు దారుణంగా జరిగే అవకాశం ఉందని సమాచారం అందినందున ఏపీ పోలీసులు మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. మొత్తం 5600 మందికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. సీఆర్పీఎఫ్ ఐజీ చారు సిన్హా ప్రధాన కార్యాలయంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, చిత్తూరులో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాతో కౌంటింగ్ కేంద్రాల వద్ద 5-స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.
 
స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా దీపక్ మిశ్రా నియమితులయ్యారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో 4, 5 తేదీల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గొడవ చేస్తే రౌడీషీట్‌ తెరుస్తామని పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో బ్లాక్‌కు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు, 9 టిఆర్ గ్యాస్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి, రెండు టియర్ గ్యాస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

కౌంటింగ్ ప్రక్రియలో పోలీసులు సోషల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తున్నారు. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐటీ చట్టం కింద కేసులు పెడితే రౌడీషీట్‌లు, పీడీ ఏసీటీ ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ స్టేటస్‌గా ఫోటోలు, వీడియోలతో సహా రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయడం, భాగస్వామ్యం చేయడం నిషేధించారు. అలానే గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>