PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-jagan-sharmila-sunitha-ys-vijayamma-70d664cc-883a-40f7-8ee3-e7a8735e2f7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-jagan-sharmila-sunitha-ys-vijayamma-70d664cc-883a-40f7-8ee3-e7a8735e2f7e-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి అతిగా ఆలోచించారా.. 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తనకు మరోసారి వస్తుందని భావించారా..అంత ఈజీగా కూటమిని ఎలా తీసి పడేశారు.. కేవలం కూటమినే కాదు తన కుటుంబ సభ్యులను కూడా చాలా చీప్ గా చూశారు. తన సొంత చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి షర్మిలను కూడా చెడుగుడు ఆడుకున్నారు. దీంతో కన్నెర్ర చేసినటువంటి చెల్లెళ్లు షర్మిల మరియు వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత జగన్ ను ఎలాగైనా ఓడించాలనుకున్నారు. అన్నపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వివేకానంద రెడ్డి హత్య గురించి పదేపదే బయటకు తీసుకువచ్చి AP;JAGAN;SHARMILA;SUNITHA;YS VIJAYAMMA;{#}Y S Vivekananda Reddy;Sharmila;Manam;politics;House;Reddy;Yevaru;TDP;Hanu Raghavapudi;Andhra Pradesh;Jaganకుటుంబం ‘గడప’ దాటితే.. ఓటమి నట్టింట్లో కి నడిచొస్తుందేమో!కుటుంబం ‘గడప’ దాటితే.. ఓటమి నట్టింట్లో కి నడిచొస్తుందేమో!AP;JAGAN;SHARMILA;SUNITHA;YS VIJAYAMMA;{#}Y S Vivekananda Reddy;Sharmila;Manam;politics;House;Reddy;Yevaru;TDP;Hanu Raghavapudi;Andhra Pradesh;JaganTue, 04 Jun 2024 12:04:47 GMT జగన్మోహన్ రెడ్డి అతిగా ఆలోచించారా.. 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తనకు మరోసారి వస్తుందని భావించారా..అంత ఈజీగా కూటమిని ఎలా తీసి పడేశారు.. కేవలం కూటమినే కాదు తన కుటుంబ సభ్యులను కూడా  చాలా చీప్ గా చూశారు. తన సొంత చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి  షర్మిలను కూడా చెడుగుడు ఆడుకున్నారు. దీంతో కన్నెర్ర చేసినటువంటి చెల్లెళ్లు  షర్మిల మరియు వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత జగన్ ను ఎలాగైనా ఓడించాలనుకున్నారు. అన్నపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వివేకానంద రెడ్డి హత్య గురించి పదేపదే బయటకు తీసుకువచ్చి  రాష్ట్రమంతా ఆ ప్రభావం పడేలా చేశారని చెప్పవచ్చు.

 ఈ విధంగా కుటుంబం నుండి బయటికి వచ్చి జగన్ నట్టింట్లోకి ఓటమిని తీసుకువచ్చారు జగన్ చెల్లెళ్లు. సాధారణంగా ఏ చెల్లెళ్లు అయినా అన్న ఎదుగుదలను కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్లు మాత్రం అన్న  తరుగుదలను కోరుకున్నారని చెప్పవచ్చు.  వారు అంత కఠినంగా ఆలోచించారంటే జగన్మోహన్ రెడ్డి వారిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం కుటుంబాన్నే కంట్రోల్ లో పెట్టుకోనోడు  రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఏపీ ప్రజలంతా ముక్కుమ్మడిగా కూటమి అభ్యర్థులకే పట్టం కట్టినట్టు ఈ రిజల్ట్ చూస్తే కనిపిస్తోంది. ఎప్పుడైనా సరే ఇల్లు చక్కదిద్దుకున్నాకే బయటకు వచ్చి  రాజకీయాలు చేయాలి.

 ఇంట్లో సక్కగుండదు  రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను చక్కబరుస్తా అంటే ఎవరు నమ్ముతారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది. సొంత రక్తసంబంధీకులే  వైసిపిపై తిరుగుబాటు చేయడంతో  ఓటమి నట్టింట్లోకి నడిచి వచ్చినట్టయింది. అంతేకాకుండా కొంతమంది టీడీపీ నాయకులు, అభిమానులు జగన్ కి తన సొంత చెల్లెళ్ల ఉసురు తగిలిందని, చేసిన పాపం ఎప్పటికైనా తగలక మానదని  అంటున్నారు. ఈ విధంగా కుటుంబం కంకణం కట్టుకొని బయటకు వచ్చి  వైసిపిని నడి సముద్రంలో ముంచేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>