PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-guntur-jagan-ap-result-chandrababu-lokeshb3d646c6-8d4e-48c7-b9d4-3f981195ae55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-guntur-jagan-ap-result-chandrababu-lokeshb3d646c6-8d4e-48c7-b9d4-3f981195ae55-415x250-IndiaHerald.jpgఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ అనుకున్న ఫలితం పూర్తిగా రాలేదని చెప్పవచ్చు. గుంటూరులో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం అయితే వైసిపికి లేదనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుంటూరులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం పూర్తిస్థాయిగా కూటమి అభ్యర్థుల చేతుల్లోకే వచ్చాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి లీడింగ్ లోనే ఉన్నారు.కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఇక్కడ వైసిపి ఖాతా తెరిచే అవకాశం అయితే కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం గుంటూరు ప్రజలు కారమంతా నూరి జగన్ నోట్లో కొట్టినట్టే YCP;GUNTUR;JAGAN;AP RESULT;CHANDRABABU;LOKESH{#}Kiran Kumar;dhulipala;murali;sravan;Thadikonda;Siva Kumar;Rajani kanth;Ponnur;Tenali;Nadendla Manohar;Mangalagiri;Thota Chandrasekhar;Guntur;Scheduled caste;Nara Lokesh;madhavi;Janasena;YCP;Jagan;TDP;Assembly;Parliamentజగన్ నోట్లో "గుంటూరు" కారం.. తట్టుకోలేకపోయాడుగా.?జగన్ నోట్లో "గుంటూరు" కారం.. తట్టుకోలేకపోయాడుగా.?YCP;GUNTUR;JAGAN;AP RESULT;CHANDRABABU;LOKESH{#}Kiran Kumar;dhulipala;murali;sravan;Thadikonda;Siva Kumar;Rajani kanth;Ponnur;Tenali;Nadendla Manohar;Mangalagiri;Thota Chandrasekhar;Guntur;Scheduled caste;Nara Lokesh;madhavi;Janasena;YCP;Jagan;TDP;Assembly;ParliamentTue, 04 Jun 2024 12:39:26 GMTఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ అనుకున్న ఫలితం పూర్తిగా రాలేదని చెప్పవచ్చు.  గుంటూరులో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం అయితే వైసిపికి లేదనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుంటూరులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం పూర్తిస్థాయిగా కూటమి అభ్యర్థుల చేతుల్లోకే వచ్చాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి లీడింగ్ లోనే ఉన్నారు.కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఇక్కడ వైసిపి ఖాతా తెరిచే అవకాశం అయితే కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం గుంటూరు ప్రజలు కారమంతా నూరి జగన్ నోట్లో కొట్టినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి టిడిపి కూటమి నారా లోకేష్ 19 వేలకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు.

 వైసిపి నుంచి పోటీ చేసిన మురుగుడు లావణ్య వెనుకబడిపోయింది. అలాగే గుంటూరు ఈస్ట్ కు సంబంధించి  టిడిపి కూటమి నుంచి పోటీ చేసిన మహమ్మద్ నజీర్ ఎనిమిదవ రౌండ్ కు వచ్చేసరికి 14,837 ఓట్ల తేడాతో దూసుకుపోతున్నారు. నూరి ఫాతిమా వైసీపీ నుంచి పోటీ చేసి వెనుకబడిపోయింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి కొత్త నేత టిడిపి కూటమి అభ్యర్థి గల్లా మాధవి 7097 కోట్ల మెజారిటీతో విడదల రజినీ పై విజయ బావుటా ఎగరవేసే దిశలో దూసుకెళ్తోంది. మరో నియోజకవర్గం తెనాలి విషయానికి వస్తే.. ఇక్కడ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ 9వ రౌండ్ కు వచ్చేసరికి 25395 మెజారిటీతో దూసుకుపోతున్నారు. అన్నబత్తుని శివకుమార్  మనోహర్ స్పీడ్ ను తట్టుకోలేకపోతున్నారు.

ఇక పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి టిడిపి కూటమి అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర ఆరవ రౌండు వచ్చేసరికి 12,205 ఓట్ల తేడాతో అంబటి మురళి పై దూసుకుపోతున్నారు. ఇక పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గ విషయానికి వస్తే..టిడిపి తరఫున పోటీ చేసినటువంటి రామాంజనేయులు ఏడవ రౌండ్ కు వచ్చేసరికి 15790 ఓట్ల తేడాతో కిరణ్ కుమార్ పై దూసుకుపోతున్నారు.  అంతేకాకుండా తాడికొండ ఎస్సీ నియోజకవర్గ విషయానికి వస్తే..టిడిపి అభ్యర్థి శ్రావణ్ కుమార్ నాలుగో రౌండు ముగిసేసరికి 21,892 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి సుచరిత పై దూసుకుపోతున్నారు. అంతే కాకుండా పార్లమెంటు స్థానానికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్   దాదాపు 3 లక్షల మెజారిటీ సాధిస్తారని ముందుగానే చెప్పారు అది జరిగేటట్టే కనిపిస్తోంది. ఈ విధంగ గుంటూరు జిల్లా మొత్తం  టీడీపీ కూటమి హవా నడుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>