PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఈ ప్రజాస్వామ్యంలో అన్ని అర్హతలు ఉంటే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంతే కాకుండా మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓటు కూడా వేయవచ్చు. ఒకవేళ ఏ అభ్యర్థి నచ్చకుంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది అనే విషయానికి వస్తే.. నీకు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే అందులో ఉండే నోటా ఆప్షన్ కి కూడా మీరు ఓటు వేయవచ్చు. ఆ విధంగా ఈ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా దాదాపు రెండు లక్షలకు దగ్గరగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఇంతకీ అక్కడ అభ్యర్థి ఎవరికీ నచ్చలేదా.. లేదంటే కావాలని నోటాకు వేశారా అనే వివరాలు చూద్దాం.shankar lalvani;akshay kranthi;indoor;nota;bjp;congress{#}Bihar;shankar;Indore;Madhya Pradesh - Bhopal;Congress;Manam;Parliament;Ishtam;MP;Bharatiya Janata Party;Partyఅక్కడ 2 లక్షల ఓట్లు నోటాకే.. కారణమిదేనా.?అక్కడ 2 లక్షల ఓట్లు నోటాకే.. కారణమిదేనా.?shankar lalvani;akshay kranthi;indoor;nota;bjp;congress{#}Bihar;shankar;Indore;Madhya Pradesh - Bhopal;Congress;Manam;Parliament;Ishtam;MP;Bharatiya Janata Party;PartyTue, 04 Jun 2024 14:25:47 GMT ఈ ప్రజాస్వామ్యంలో అన్ని అర్హతలు ఉంటే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంతే కాకుండా మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓటు కూడా వేయవచ్చు. ఒకవేళ ఏ అభ్యర్థి నచ్చకుంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది అనే విషయానికి వస్తే..  నీకు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే అందులో ఉండే నోటా ఆప్షన్ కి కూడా మీరు ఓటు వేయవచ్చు. ఆ విధంగా ఈ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా దాదాపు రెండు లక్షలకు దగ్గరగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఇంతకీ అక్కడ అభ్యర్థి ఎవరికీ నచ్చలేదా.. లేదంటే కావాలని నోటాకు వేశారా అనే వివరాలు చూద్దాం. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి.  ఈ స్థానంలో బిజెపి పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వాని పోటీ చేశారు. ఈయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అక్షయ కాంతి బామ్ పోటీ చేశారు కానీ  చివరి సమయంలో ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే బిజెపిలో చేరిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి కరువైపోయారు. దీంతో నిరాశకు గురైనటువంటి కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయిలో నోటాకు ఓటెయ్యాలని ప్రచారం చేసుకున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 1:15 గంటల టైం వరకు శంకర్ లాల్వాని 8.5 లక్షలు మెజారిటీతో గెలుపొందారు అని చెప్పవచ్చు.  ఈయన తర్వాత అత్యధికంగా నోటా కే ఓట్లు వేశారు.

నోటాకు 1,85,000  ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. ఆ విధంగా కాంగ్రెస్ ప్రచారానికి ఇది ఫలితం అని చెప్పవచ్చు. ఇక్కడ రెండో స్థానంలో ఉన్నటువంటి బహుజన సమాజ్వాది పార్టీ అభ్యర్థి 43 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన కంటే  నోటా కే దాదాపు రెండు లక్షలు పడ్డాయి. ఇప్పటి వరకు ఎన్నికల చరిత్రలో బీహార్ గోపాల్గంజ్ స్థానంలో నోటాకు యాబై ఒక్కవేల ఓట్ల రికార్డు ఉంది. ఆ రికార్డును ఇండోర్ నియోజకవర్గ ప్రజలు చెరిపేశారు.  దీంతో ఆ రికార్డు వారి పార్లమెంటు స్థానానికి వెళ్లిపోయింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మనకు అభ్యర్థి నచ్చకపోతే తప్పకుండా  నోటాకు వేసే ఆప్షన్ ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నోటాకు ఓటు హక్కు ఉన్న ఎవరైనా ఓటు వేయవచ్చు. ప్రస్తుతం నోటా కు ఇన్ని ఓట్లు పడడంతో  దేశవ్యాప్తంగా ఈ లోక్ సభా స్థానం చర్చనీయాంశంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>