PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024164949cf-1e07-441e-9725-8fed7c608d68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024164949cf-1e07-441e-9725-8fed7c608d68-415x250-IndiaHerald.jpgవిశాఖ అరకులో అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైసిపిలో అరకు అభ్యర్థి ఎంపిక కోసం అంతక ముందు సుధీర్ఘ కసరత్తు జరిగింది. అరకులో కొండదొర సామాజికవర్గ ఓటర్లు దగ్గర దగ్గరగా లక్షమంది వున్నారు.దీంతో ఆ సామాజికవర్గానికి అరకు సీటు కేటాయించాలని వైసిపి అధిష్టానం భావించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న చిట్టి పాల్గుణకు కాకుండా ఎంపీ గొడ్డేడి మాధవికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది వైసిపి అధిష్టానం. అయితే అరకు వైసిపి నాయకులు మాధవిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంచార్జీ బాధ్యతల నుండి AP Elections 2024{#}Athadu;local language;sravan;Bharatiya Janata Party;MP;Telugu Desam Party;Araku Valley;MLA;Hanu Raghavapudi;Assembly;TDP;YCPవిశాఖ - అరకు: ఘనవిజయం సాధించిన వైసీపీ అభ్యర్థి?విశాఖ - అరకు: ఘనవిజయం సాధించిన వైసీపీ అభ్యర్థి?AP Elections 2024{#}Athadu;local language;sravan;Bharatiya Janata Party;MP;Telugu Desam Party;Araku Valley;MLA;Hanu Raghavapudi;Assembly;TDP;YCPTue, 04 Jun 2024 19:07:00 GMTవిశాఖ అరకులో అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైసిపిలో అరకు అభ్యర్థి ఎంపిక కోసం అంతక ముందు సుధీర్ఘ కసరత్తు జరిగింది. అరకులో కొండదొర సామాజికవర్గ ఓటర్లు దగ్గర దగ్గరగా లక్షమంది వున్నారు.దీంతో ఆ సామాజికవర్గానికి అరకు సీటు కేటాయించాలని వైసిపి అధిష్టానం భావించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న చిట్టి పాల్గుణకు కాకుండా ఎంపీ గొడ్డేడి మాధవికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది వైసిపి అధిష్టానం. అయితే అరకు వైసిపి నాయకులు మాధవిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించడం జరిగింది.ఇక ఆ స్థానంలో స్థానిక నాయకుడు మత్స్యలింగంను నియమించింది. ఇక మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రావణ్ కుమార్ ను గతంలో తెలుగుదేశం పార్టీ మంత్రిపదవి ఇచ్చింది. 


ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శ్రావణ్ ను బరిలోకి దింపింది. కానీ అతడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈసారి శ్రావణ్ ను పక్కనబెట్టిన టిడిపి కూటమి బీజేపీ అభ్యర్థి రాజారావు పాంగిని బరిలోకి దింపడం జరిగింది.అరకు నియోజకవర్గ పరిధిలో ముంచింగిపుట్టు, పెడబయలు, డుంబ్రిగూడ, హుకుంపేట, అనంతగిరి, అరకు లోయ మండలాలు ఉన్నాయి.అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య  - 2,20,893 కాగా అందులో పురుషులు - 1,08,190 ఇంకా మహిళలు - 1,12,698 ఉన్నారు.అరకు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా రేగం మత్య్స లింగం పోటీలో ఉండగా ఇక టీడీపీ కూటమి బీజేపీ అభ్యర్థి రాజారావు పాంగి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. వీరిలో 65658 (+ 31877) ఓట్లతో వైసీపీ అభ్యర్థి రేగం మత్య్స లింగం ఉండగా బీజేపీ అభ్యర్థి రాజారావు పంగి 33781 ( -31877) ఓట్లతో వెనుకబడి ఉన్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>