PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024-c5cdf01d-7a22-41a2-ab7c-2d2a143907bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024-c5cdf01d-7a22-41a2-ab7c-2d2a143907bf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రానుందో దాదాపుగా క్లారిటీ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు ఓటర్లను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీ? ఓడిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ap elections 2024 {#}Krishna River;Vijayawada;kadapa;Kurnool;Mylavaram;pattikonda;Sharmila;Nara Lokesh;pithapuram;Hanu Raghavapudi;Yevaru;Balakrishna;Jagan;CBN;Andhra Pradesh;Telangana;Partyఅందరి చూపు వీటి వైపు.. ఏపీలో ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలు ఇవే!అందరి చూపు వీటి వైపు.. ఏపీలో ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలు ఇవే!ap elections 2024 {#}Krishna River;Vijayawada;kadapa;Kurnool;Mylavaram;pattikonda;Sharmila;Nara Lokesh;pithapuram;Hanu Raghavapudi;Yevaru;Balakrishna;Jagan;CBN;Andhra Pradesh;Telangana;PartyTue, 04 Jun 2024 07:27:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రానుందో దాదాపుగా క్లారిటీ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు ఓటర్లను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీ? ఓడిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
కుప్పం, హిందూపురం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో కూటమికి అనుకూల ఫలితాలు రావాలని కూటమి అభిమానులు కోరుకుంటున్నారు. పవన్, లోకేశ్ ఎంత మెజార్టీతో గెలుస్తారనే చర్చ ఓటర్ల మధ్య జరుగుతోంది. బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారా అనే చర్చ సైతం పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. కుప్పంలో బాబు గెలువడం ఖాయమని అయితే ఎంత మెజార్టీతో గెలుస్తారనే చర్చ కూడా జరుగుతోంది.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పులివెందులలో సాధించిన మెజార్టీని మించి సాధిస్తారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ లోక్ సభ, గుడివాడ, గన్నవరం, మైలవరం రిజల్ట్ విషయంలో టెన్షన్ నెలకొంది. కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపొతారనే చర్చ కూడా మొదలైంది.
 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు అసెంబ్లీ, డోన్, బనగానపల్లె, పత్తికొండ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నెలకొనగా ఈ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరి సొంతమవుతుందో చూడాల్సి ఉంది. ఆరామస్తాన్ సర్వే, వేణుస్వామి జాతకం నిజమవుతాయో లేదో ఈరోజు ఫలితాలతో క్లారిటీ రానుంది. రౌండ్ రౌండ్ కు ఓటర్లలో ఉత్కంఠ మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఓటర్లు సైతం ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2 శాతం ఓట్ల తేడాతో  మాత్రమే అధికారం సాదించే ఛాన్స్ అయితే ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>