Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kondaf81155c0-9aad-43b2-8263-8fd42367c997-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kondaf81155c0-9aad-43b2-8263-8fd42367c997-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది బిజెపి. క్రమక్రమంగా తమ సీట్ల సంఖ్యను అంతకంచుకు పెంచుకుంటూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీగా సీట్లు గెలుచుకుంటుంది అనే నమ్మకాన్ని కలిగించింది. ఏకంగా కీలకమైన స్థానాలలో విజయం సాధించింది. అది కూడా భారీ మెజారిటీతో.. బిజెపి అభ్యర్థులు విజయ డంకా మోగించారు అని చెప్పాలి. ఇలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడు లేని విధంగా బిజెపి పార్టీ ప్రభంజనమే సృష్టించింది. ఏకంగా బిఆర్ఎస్ పార్టీకి కంచుKonda{#}vishwa;MP;Parliment;Yevaru;Bharatiya Janata Party;Congress;Reddy;Party'కొండా'ను ఢీకొట్టబోయారు.. కానీ చేయికి గాయం, కారుకి పంచర్?'కొండా'ను ఢీకొట్టబోయారు.. కానీ చేయికి గాయం, కారుకి పంచర్?Konda{#}vishwa;MP;Parliment;Yevaru;Bharatiya Janata Party;Congress;Reddy;PartyTue, 04 Jun 2024 15:43:33 GMTతెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది బిజెపి. క్రమక్రమంగా తమ సీట్ల సంఖ్యను అంతకంచుకు పెంచుకుంటూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీగా సీట్లు గెలుచుకుంటుంది అనే నమ్మకాన్ని కలిగించింది. ఏకంగా కీలకమైన స్థానాలలో విజయం సాధించింది. అది కూడా భారీ మెజారిటీతో.. బిజెపి అభ్యర్థులు  విజయ డంకా మోగించారు అని చెప్పాలి.

ఇలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడు లేని విధంగా బిజెపి పార్టీ ప్రభంజనమే సృష్టించింది. ఏకంగా బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా కొనసాగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాలలో సైతం కాషాయ జండా ఎగరవేస్తుంది. అయితే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ రాజకీయ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేశారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిలు కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగారు.


 ఈ క్రమంలోనే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని ఇక హోరా హోరీగా అభ్యర్థుల మధ్య పోరు జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బిజెపి భారీ మెజారిటీ అందుకుంది. ఏకంగా బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఒకటి1.38 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రెండవ స్థానంలో నిలవగా.. బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ మూడో స్థానంలో నిలిచారు అని చెప్పాలి. ముందు నుంచి ఆదిక్యంలో కొనసాగుతూ వచ్చిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి చివరికి లక్షకు ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>