PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modifeba508c-12ef-4e2f-bc4a-ec2e782094c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modifeba508c-12ef-4e2f-bc4a-ec2e782094c5-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది ఇండియా కూటమి. ఎగ్జిట్ ఫలితాలు, అలాగే సర్వే లెక్కలు ఎవరు ఊహించని విధంగా... దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు... ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ... ఎవరు ఊహించని విధంగా తమ స్థానాలను గెలుచుకునే దిశగా ముందుకు వెళ్తున్నాయి. modi{#}Ayodhya;ram mandir;Rahul Gandhi;Narendra Modi;Survey;Kerala;Manam;Government;Parliament;MP;Yevaru;Parliment;National Democratic Alliance;India;Elections;Bharatiya Janata Party;Congressమోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్న రాహుల్... 200 సీట్లు క్రాస్?మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్న రాహుల్... 200 సీట్లు క్రాస్?modi{#}Ayodhya;ram mandir;Rahul Gandhi;Narendra Modi;Survey;Kerala;Manam;Government;Parliament;MP;Yevaru;Parliment;National Democratic Alliance;India;Elections;Bharatiya Janata Party;CongressTue, 04 Jun 2024 11:02:00 GMTదేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది ఇండియా కూటమి. ఎగ్జిట్ ఫలితాలు, అలాగే సర్వే లెక్కలు ఎవరు ఊహించని విధంగా... దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు... ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ... ఎవరు ఊహించని విధంగా తమ స్థానాలను గెలుచుకునే దిశగా ముందుకు వెళ్తున్నాయి.

 దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఇప్పటికే డబ్బులు సెంచరీ మార్కు దాటేసింది. ఎన్డీఏ కూటమి 290 ప్లస్  స్థానాల్లో లీడింగ్ లో ఉండగా... ఇండియా కూటమి 220  పైగా పార్లమెంటు స్థానాలలో లీడింగ్ తో దూసుకు వెళ్తోంది. గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల లోపు... లేదా 50 స్థానాలకే పరిమితమైవుతూ వచ్చేది. కానీ పది సంవత్సరాల తర్వాత... సొంతంగా 100 సీట్లు దాటగలిగింది.

 ఇంకా చాలా స్థానాలలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా ఇండియా కూటమి... మోడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా సీట్లను సంపాదిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.... nda కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీల అవసరం ఇంకా ఉంటుంది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో లీడింగ్ లో ఉన్నారు.

 కేరళ రాష్ట్రంలోని వయనాడు అలాగే ఉత్తరప్రదేశ్లోని... రాయబరేలి  నియోజకవర్గాలలో... రాహుల్ గాంధీ అఖండ  మెజారిటీ దిశగా దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిరం నిర్మించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా బిజెపి పార్టీ వెనుకబడింది. దాదాపు 50 స్థానాలలో  ఉత్తరప్రదేశ్ ఎంపీ స్థానాలలో గెలుచుకునే దిశగా ఇండియా కూటమి వెళ్తోంది. ఉత్తరప్రదేశ్లో రామ మందిరం నిర్మించినప్పటికీ కూడా.... బిజెపి పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనను దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు  ఈ ఎన్నికలు చెబుతున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>