PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandragiri05c9f892-216c-4b25-b5f3-c27a7ff2078c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandragiri05c9f892-216c-4b25-b5f3-c27a7ff2078c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గం ఫలితాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేశారు. వైసీపీ తరపున యువకుడైన మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేత పులివర్తి నాని పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. chandragiri{#}Chandragiri;Chevireddy Bhaskarareddy;Moon;Nani;Chittoor;Reddy;Jagan;MLA;Andhra Pradesh;YCPచంద్రగిరిలో మెరిసిన చంద్రుడు ఇతనే.. భారీ మెజారిటీతో అదరగొట్టేశాడుగా!చంద్రగిరిలో మెరిసిన చంద్రుడు ఇతనే.. భారీ మెజారిటీతో అదరగొట్టేశాడుగా!chandragiri{#}Chandragiri;Chevireddy Bhaskarareddy;Moon;Nani;Chittoor;Reddy;Jagan;MLA;Andhra Pradesh;YCPTue, 04 Jun 2024 21:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గం ఫలితాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేశారు. వైసీపీ తరపున యువకుడైన మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేత పులివర్తి నాని పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది.
 
ఈ నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగడంతో ఈ నియోజకవర్గంలో ఫలితం ఒకింత ఆలస్యమైంది. చంద్రగిరిలో మెరిసిన చంద్రుడు ఎవరనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్ది మోహిత్ రెడ్డికి అనుకూల ఫలితాలు వస్తాయని అందరూ భావించినా నియోజకవర్గంలో ఫలితం మాత్రం రివర్స్ అయింది.
 
ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నానికి ఏపీ ఓటర్లు పట్టం కట్టారు. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడటంతో పాటు ఎంతో అనుభవం ఉన్న నేత కావడంతో నియోజకవర్గంలో ప్రజలు ఆయననే బలంగా నమ్మారని తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా కేవలం పుంగనూరు, తంగళ్లపల్లెలో మాత్రమే వైసీపీ సత్తా చాటింది.
 
మిగతా నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం కావడం హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఏపీ ఓటర్ల నాడి సర్వేలకు సైతం అంతు చిక్కలేదని ఈ ఎన్నికల ఫలితాలతో క్లారిటీ వచ్చేసింది. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కష్టపడితే మాత్రం భవిష్యత్తులో ఆయనకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>