PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf7fc6a44-cdf1-4fe3-adc4-f3ecdd01abad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf7fc6a44-cdf1-4fe3-adc4-f3ecdd01abad-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలలో వై సి పి , కూటమి మొదటి నుండి చాలా సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గాలలో శృంగవరపుకోట ఒకటి. ఈ నియోజకవర్గం నుండి 2009 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీ డీ పీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోళ్ల లలిత కుమారి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇక 2014 వ సంవత్సరం కూడా ఈమె టి డి పి పార్టీ నుండి ఇదే ప్రాంతం ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకొని రెండవ సారి కూడా ఇక్కడి నుండి గెలుపొందింది. ఇక 2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేసిన కాడుబap{#}Yevaru;Assembly;Party;Hanu Raghavapudi;MLA;YCP;Telugu Desam Partyశృంగవరపుకోట : తెలుగుదేశం అభ్యర్థి ముందు తేలిపోయిన వైసీపీ క్యాండిడేట్..!శృంగవరపుకోట : తెలుగుదేశం అభ్యర్థి ముందు తేలిపోయిన వైసీపీ క్యాండిడేట్..!ap{#}Yevaru;Assembly;Party;Hanu Raghavapudi;MLA;YCP;Telugu Desam PartyTue, 04 Jun 2024 19:49:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలలో వై సి పి , కూటమి మొదటి నుండి చాలా సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గాలలో శృంగవరపుకోట ఒకటి. ఈ నియోజకవర్గం నుండి 2009 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీ డీ పీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోళ్ల లలిత కుమారి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇక 2014 వ సంవత్సరం కూడా ఈమె టి డి పి పార్టీ నుండి ఇదే ప్రాంతం ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకొని రెండవ సారి కూడా ఇక్కడి నుండి గెలుపొందింది.

ఇక 2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేసిన కాడుబండి శ్రీనివాసరావు గెలుపొందారు. ఇకపోతే తాజాగా జరిగిన ఎన్నికలలో ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కాడుబండి శ్రీనివాసరావు బరిలో నిలువగా , కూటమి అభ్యర్థి గా ఇప్పటికే 2009 , 2014 వ సంవత్సరాలలో ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కోళ్ల లలిత కుమారి పోటీలో ఉంది. ఇక ఇప్పటికే వీరిద్దరూ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఉండడంతో ఈ ప్రాంతం పై వీరికి చాలా పట్టు ఉంది.

అలాగే భారీ స్థాయిలో వీరిద్దరికీ క్యాడర్ కూడా ఉంది. దానితో వీరిద్దరి మధ్య భారీ పోటీ ఉంటుంది , చివరి నిమిషం వరకు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది చెప్పడం కష్టం అని మొదటి నుండి ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ ప్రాంతంలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శృంగవరపుకోట నియోజకవర్గం లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థురాలు అయినటువంటి కొల్లా లలితా కుమారి 111026 ఓట్లతో గెలుపొందింది. ఇక వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి కడుబండి శ్రీనివాసరావు 72236 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. దానితో శ్రీనివాసరావు పై లలితా కుమారి 38790 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>