PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/payyavula-keshav-rayalasima-uravakonda-win-tdp2c2d6f9c-e861-45ef-bbd6-fb478ba52fa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/payyavula-keshav-rayalasima-uravakonda-win-tdp2c2d6f9c-e861-45ef-bbd6-fb478ba52fa5-415x250-IndiaHerald.jpgగత కొన్ని సంవత్సరాలుగా ఉరవకొండ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ పయ్యావుల కేశవ గత కొన్ని సంవత్సరాలుగా ఉరవకొండలో ఎమ్మెల్యేగా అధికారాన్ని దక్కించుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈసారి కూడా 2024 ఎన్నికలలో టిడిపి తరఫున పోటీకి దిగారు పయ్యావుల కేశవ .. ఈయనకు పోటీగా వైసీపీ తరఫున వై విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. అయితే ఈసారి ఎన్నికలలో మాత్రం టిడిపికి కాస్త భయం చుట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా అక్రమ ఆస్తుల కేసులో పయ్యావుల కేశవ PAYYAVULA KESHAV;RAYALASIMA;URAVAKONDA;WIN;TDP{#}Uravakonda;Party;Reddy;TDP;YCP;Congressఉరవకొండ: పయ్యావుల కేశవ్ గెలుపు.. బ్రేక్ చేసిన సెంటిమెంట్..!ఉరవకొండ: పయ్యావుల కేశవ్ గెలుపు.. బ్రేక్ చేసిన సెంటిమెంట్..!PAYYAVULA KESHAV;RAYALASIMA;URAVAKONDA;WIN;TDP{#}Uravakonda;Party;Reddy;TDP;YCP;CongressTue, 04 Jun 2024 14:40:10 GMTగత కొన్ని సంవత్సరాలుగా ఉరవకొండ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా మారిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఇక్కడ పయ్యావుల కేశవ గత కొన్ని సంవత్సరాలుగా ఉరవకొండలో ఎమ్మెల్యేగా అధికారాన్ని దక్కించుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈసారి కూడా 2024 ఎన్నికలలో టిడిపి తరఫున పోటీకి దిగారు పయ్యావుల కేశవ .. ఈయనకు పోటీగా వైసీపీ తరఫున వై విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. అయితే ఈసారి ఎన్నికలలో మాత్రం టిడిపికి కాస్త భయం చుట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా అక్రమ ఆస్తుల కేసులో పయ్యావుల కేశవ స్థానికంగా ప్రజల చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు.. పైగా ఈ మధ్యకాలంలో పయ్యావుల కేశవ కు ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది.. ఈ విషయంలో అక్కడ ఆయనకు నెగిటివిటీ ఎక్కువగా ఏర్పడిందని తెలుస్తోంది..

మరొకవైపు వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి కి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ఈయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.. అంతకుముందు కాంగ్రెస్ తరపున పోటీ చేసినా సరే అధికారంలోకి రాలేకపోయారు.. దీంతో ఎలాగైనా సరే ఒకసారి అవకాశం ఇవ్వాలని ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ఆశించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా వై విశ్వేశ్వర్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ఇక అటు పయ్యావుల కేశవ ఇటు వై విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య పోటీ గట్టిగానే సాగింది. మే 13వ తేదీన జరిగిన ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ లో కూడా వై విశ్వేశ్వర్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు సమాచారం..

ఇక చివరి కౌంటింగ్లో ఫలితాలు ఎవరికి మొగ్గు చూపాయి అనే విషయానికి వస్తే.. పయ్యావుల కేశవ .. వైసిపి అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి పైన ఏకంగా 21, 704 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు ఇప్పటివరకు ఉన్న 25 ఏళ్ల సెంటిమెంట్ కి పయ్యావుల కేశవ బ్రేక్ కొట్టారని చెప్పాలి ...ఇక ఏంటా సెంటిమెంట్ అంటే ఉరవకొండలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రభుత్వంలో ఆ పార్టీ ఓడిపోతుందనే సెంటిమెంట్ 25 సంవత్సరాలుగా కొనసాగుతోంది.. ఉదాహరణకు 2004,  2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ గెలవగా..ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . 2014లో వైసిపి అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలవగా.. ఆ ఎన్నికలలో  టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..  2019లో టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ గెలవగా ... ఏపీలో వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..  ఇలా ఎన్నికల్లో ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని అంతా భావించారు .. కానీ 25 ఏళ్ల తర్వాత పయ్యావుల కేశవ గెలిచి అధికారంలో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు పయ్యావుల కేశవ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>