PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/have-you-seen-the-anarchy-of-janasena-nanaji-s-victory-what-are-these-recordsd8288d2b-54cf-4a89-8043-fad1f4bd9619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/have-you-seen-the-anarchy-of-janasena-nanaji-s-victory-what-are-these-recordsd8288d2b-54cf-4a89-8043-fad1f4bd9619-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైసీపీ, జనసేన మధ్య పోటీ జరిగిన నియోజకవర్గాలలో కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నాడు ప్రజారాజ్యం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబు.. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో తొలి ముడేళ్లపాటు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు అనుకోకుండా కన్నబాబు తాను అమితంగా ఇష్టపడే మెగా ఫ్యామిలీకి చెందిన హీరో పవన్ కళ్యాAP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024; Kakinada rural MLA pantham nanaji{#}Kurasala Kannababu;Chiranjeevi;Hero;kakinada;Jagan;Party;Hanu Raghavapudi;YCP;kalyan;Telugu Desam Party;Janasenaకాకినాడ రూర‌ల్ : జ‌న‌సేన నానాజీ గెలుపు అరాచ‌కం చూశారా.. ఈ రికార్డులు ఏంటి సామి..!కాకినాడ రూర‌ల్ : జ‌న‌సేన నానాజీ గెలుపు అరాచ‌కం చూశారా.. ఈ రికార్డులు ఏంటి సామి..!AP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024; Kakinada rural MLA pantham nanaji{#}Kurasala Kannababu;Chiranjeevi;Hero;kakinada;Jagan;Party;Hanu Raghavapudi;YCP;kalyan;Telugu Desam Party;JanasenaTue, 04 Jun 2024 19:38:01 GMTఏపీలో అధికార వైసీపీ, జనసేన మధ్య పోటీ జరిగిన నియోజకవర్గాలలో కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నాడు ప్రజారాజ్యం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబు.. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో తొలి ముడేళ్లపాటు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు అనుకోకుండా కన్నబాబు తాను అమితంగా ఇష్టపడే మెగా ఫ్యామిలీకి చెందిన హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అభ్యర్థితోనే పోటీ పడాల్సి వచ్చింది. కూటమి పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు.


కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాకినాడ కార్పొరేష‌న్‌లోని 66 - 70 డివిజ‌న్ల‌తో పాటు కాకినాడ రూర‌ల్‌, క‌ర‌ప మండ‌లాలు విస్త‌రించి ఉన్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు బలంగా పనిచేసిన నియోజకవర్గాలలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికలలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకుని ఓడిపోయిన పంతం నానాజీకి పవన్ మరోసారి సీటు ఇవ్వగా.. ఆయన కన్నబాబును ఢీకొట్టారు. కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన పోటీ చేస్తుండడం.. రూరల్ నియోజకవర్గం పక్కనే ఉన్న పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ స్వయంగా పోటీ చేస్తుండడంతో.. ఆ ప్రభావం రూరల్ నియోజకవర్గం మీద గట్టిగా పని చేసింది.


ఎన్నికలకు ముందు పలు సర్వేలు, నివేదికలు, అంచనాలను బట్టి చూస్తే జనసేన మంచి మెజార్టీతో విజయం సాధించే నియోజకవర్గం రూరల్ కూడా ఒకటి ఉంటుందన్న అంచనాలు వచ్చేసాయి. రూరల్ నియోజకవర్గంలో జనసేన భారీ మెజార్టీతో గెలుస్తుంది అన్న పందాలు కూడా గట్టిగా నడిచాయి. ఈ రోజు కౌంటింగ్‌లో పంతం నానాజీ ఏకంగా 72040 ఓట్ల భారీ విజ‌యంతో కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో మెజార్టీ సాధించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు. ఈ మెజార్టీ కాకినాడ హిస్ట‌రీ లోనే రికార్డుగా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>