PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajahmundry-rural-buchayaya-enyayaya-this-victory-is-anarchy-eye-popping-majority52a8ceea-bec5-49ed-ba51-baa68b164f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajahmundry-rural-buchayaya-enyayaya-this-victory-is-anarchy-eye-popping-majority52a8ceea-bec5-49ed-ba51-baa68b164f09-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చ‌య్య‌ చౌదరి రూరల్ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికలలో జనసేన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో నష్టపోయింది. అయితే లాభపడిన ఒకటి, రెండు నియోజకవర్గాలలో రాజమండ్రి రూరల్ ఒక‌టి వైసీపీ, జనసేన నుంచి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడటం.. ఇటు బుచ్చయ్య చౌదరి కమ్మ స‌మాజిక వర్గానికి చెap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan{#}kakinada;choudary actor;Rajahmundry;Survey;Minister;Telugu Desam Party;Janasena;Assembly;MLA;TDP;Jagan;YCPరాజ‌మండ్రి రూర‌ల్ : బుచ్చ‌య్యా ఏంద‌య్యా ఈ గెలుపు అరాచ‌కం... క‌ళ్లు చెదిరే మెజార్టీ...!రాజ‌మండ్రి రూర‌ల్ : బుచ్చ‌య్యా ఏంద‌య్యా ఈ గెలుపు అరాచ‌కం... క‌ళ్లు చెదిరే మెజార్టీ...!ap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan{#}kakinada;choudary actor;Rajahmundry;Survey;Minister;Telugu Desam Party;Janasena;Assembly;MLA;TDP;Jagan;YCPTue, 04 Jun 2024 12:22:17 GMTగత అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చ‌య్య‌ చౌదరి రూరల్ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికలలో జనసేన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో నష్టపోయింది. అయితే లాభపడిన ఒకటి, రెండు నియోజకవర్గాలలో రాజమండ్రి రూరల్ ఒక‌టి వైసీపీ, జనసేన నుంచి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడటం.. ఇటు బుచ్చయ్య చౌదరి కమ్మ స‌మాజిక వర్గానికి చెందినవారు కావడం.. జనసేన అభ్యర్థి కందుల‌ దుర్గేష్ కు ఏకంగా 45వేల ఓట్లు రావడంతో.. ఇక్కడ వైసీపీకి దెబ్బ తగిలింది.


ఈ క్రమంలోనే బుచ్చయ్య చౌదరి రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి బుచ్చయ్య చౌద‌రిని పక్కనపెట్టి జనసేన నుంచి కందుల‌ దుర్గేష్ పోటీ చేయాలని అనుకున్నారు. చివరకు దుర్గేష్ ను నిడదవోలుకు బదిలీ చేయక తప్పలేదు. రూరల్ నియోజకవర్గంలో రాజమండ్రి కార్పోరేషన్లలోని 18 డివిజన్లతో పాటు.. రాజమండ్రి రూరల్ మండలం, కడియం మండలాలు విస్తరించి ఉన్నాయి. కాపు సామాజిక వర్గంతో పాటు.. బీసీలు ఎక్కువగా ఉంటారు. అలాగే కొంత వరకు క‌మ్మ‌ సామాజిక వర్గం కూడా రాజకీయంగా ప్రభావం చూపుతూ ఉంటుంది.
 

వైసీపీ నుంచి రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను.. జగన్ రూరల్ నియోజకవర్గానికి బదిలీ చేశారు. గత మూడు ఎన్నికలలోను మూడు నియోజకవర్గాలు మారుతూ వచ్చారు వేణుగోపాలకృష్ణ. 2014లో కాకినాడ రూరల్, 2019లో రామచంద్రపురం ఈ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం పోలింగ్ సర్వేలను బట్టి చూస్తే మెజార్టీ సర్వే అంచనాలు నివేదికలు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉందని చెబుతూ వచ్చాయి ఈరోజు జరిగిన కౌంటింగ్ లో బుచ్చ‌య్య చౌద‌రి ఏకంగా 61 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌వి జ‌యం సాధించారు. అస‌లు బుచ్చ‌య్య కెరీర్‌లోనే ఇది పెద్ద సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ అని చెప్పాలి. బుచ్చ‌య్య తాను సీనియ‌ర్ నే కాదు.. మెజార్టీలోనూ సీనియర్‌నే అని ఫ్రూవ్ చేసుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>