PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి పోటీ చేయగా కూటమి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేశారు. తంబళ్లపల్లెలో మైండ్ గేమ్ నడుస్తోందని ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడక అయితే కాదని పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించిన సంగతి విదితమే. తంబళ్లపల్లె నియోజకవర్గం గెలుపు విషయంలో ఇక్కడి ఓటర్లలో సైతం ఉత్కంఠ నెలకొంది.tamballapalle{#}GEUM;Survey;media;News;Party;Chittoor;Reddy;TDP;YCPతంబళ్లపల్లెలో ఆ పార్టీ రెక్కలు విరిగిపోయాయా.. భారీ మెజార్టీతో వైసీపీ సత్తా చాటిందిగా!తంబళ్లపల్లెలో ఆ పార్టీ రెక్కలు విరిగిపోయాయా.. భారీ మెజార్టీతో వైసీపీ సత్తా చాటిందిగా!tamballapalle{#}GEUM;Survey;media;News;Party;Chittoor;Reddy;TDP;YCPTue, 04 Jun 2024 20:15:00 GMTవైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి పోటీ చేయగా కూటమి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేశారు. తంబళ్లపల్లెలో మైండ్ గేమ్ నడుస్తోందని ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడక అయితే కాదని పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించిన సంగతి విదితమే. తంబళ్లపల్లె నియోజకవర్గం గెలుపు విషయంలో ఇక్కడి ఓటర్లలో సైతం ఉత్కంఠ నెలకొంది.
 
తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి.కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, కురుబల కోట, పెద్ద మండ్యం, ములకల చెరువు, తంబళ్లపల్లె మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించగా వైసీపీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. మెజారిటీ సందర్భాల్లో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులకు అనుకూల ఫలితాలు రావడంతో అటు వైసీపీ ఇటు కూటమి రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
 
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి అనుకూల ఫలితాలు రావడం గమనార్హం. నియోజకవర్గంలో ద్వారకానాథ్ రెడ్డికి మంచి పేరు ఉండటం ఆయనకు ఎంతగానో కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి హవా రాష్ట్రమంతా చాటినా తంబళ్లపల్లెలో మాత్రం పెద్దిరెడ్డి లెక్క మార్చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయంతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదని ద్వారకానాథ్ రెడ్డి ఫీలయ్యారని సమాచారం అందుతోంది. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటినా పెద్దిరెడ్డికి ఉన్న మంచి పేరు వల్లే ఆయనకు మాత్రం అనుకూల ఫలితాలు వచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి మాత్రం ఒకింత భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. జయచంద్రారెడ్డి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదనే చెప్పాలి.
















మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>