Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/counting52658482-a60e-4b73-bdda-9396c7fc21c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/counting52658482-a60e-4b73-bdda-9396c7fc21c0-415x250-IndiaHerald.jpgఏం జరగబోతుంది.. ఎవరు గెలవ బోతున్నారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై ఉత్కంఠ ఉంది. మే 13వ తేదీన ఓట్లు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చిన ప్రజలు.. ఇక ఇప్పుడు కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై ఉత్కంఠతో ఉన్నారు. అయితే ఇలా ఎన్నికల్లో విజయం కోసం కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఇక తమ భవిష్యత్తు ఏంటో అనే విషయం తెలుసుకునేందుకు ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే కౌంటCounting{#}Parliament;Indian Postal Service;Yevaru;Telangana;Parlimentకౌంటింగ్ స్టార్ట్ : పోస్టల్ బ్యాలెట్ హీరోలు ఎవరవుతారో?కౌంటింగ్ స్టార్ట్ : పోస్టల్ బ్యాలెట్ హీరోలు ఎవరవుతారో?Counting{#}Parliament;Indian Postal Service;Yevaru;Telangana;ParlimentTue, 04 Jun 2024 08:08:00 GMTఏం జరగబోతుంది.. ఎవరు గెలవ బోతున్నారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై ఉత్కంఠ ఉంది. మే 13వ తేదీన ఓట్లు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చిన ప్రజలు.. ఇక ఇప్పుడు కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై ఉత్కంఠతో ఉన్నారు. అయితే ఇలా ఎన్నికల్లో విజయం కోసం కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఇక తమ భవిష్యత్తు ఏంటో అనే విషయం తెలుసుకునేందుకు ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేస్తాయా అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.



 ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి అటు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 17 పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లనే ముందుగా లెక్కిస్తారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో హీరోలుగా నిలవబోయేది ఎవరు అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంది. అయితే మొత్తంగా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలలో కలుపుకొని 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే ఉదయం 8 గంటల నుంచి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే లెక్కించబోతున్నారు అధికారులు.



 ఇక ఇలా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేశారు  అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపు మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు అధికారులు.  ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచేలా భద్రత, 144 సెక్షన్ విధించారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలంగా రాకపోతున్నాయి..ఎవరికి మెజారిటీ అందించబోతున్నాయి అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంది. మరి కొంత సేపట్లో దీనిపై స్పష్టత రాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>