PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-priya142f864f-51f8-4bcc-b73d-2d522fee2640-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-priya142f864f-51f8-4bcc-b73d-2d522fee2640-415x250-IndiaHerald.jpgఉమ్మడి కర్నూలు జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఆళ్లగడ్డలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. అంటే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేరింది. ఈసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఆమెతో వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తలపడి ఘోర పరాజయం పాలయ్యారు. bhuma akhila priya{#}Gangula Prabhakar Reddy;Bhuma Akhila Priya;Allagadda;CPI;Father;Cycle;Nandyala;Kurnool;District;politics;Reddy;Election;Assembly;MLA;Party;TDP;YCPఆళ్లగడ్డలో బాణంలా దూసుకుపోయిన భూమా.. బిజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చి పడేశారు..??ఆళ్లగడ్డలో బాణంలా దూసుకుపోయిన భూమా.. బిజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చి పడేశారు..??bhuma akhila priya{#}Gangula Prabhakar Reddy;Bhuma Akhila Priya;Allagadda;CPI;Father;Cycle;Nandyala;Kurnool;District;politics;Reddy;Election;Assembly;MLA;Party;TDP;YCPTue, 04 Jun 2024 14:46:52 GMTఉమ్మడి కర్నూలు జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఆళ్లగడ్డలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. అంటే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేరింది. ఈసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఆమెతో వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తలపడి ఘోర పరాజయం పాలయ్యారు.

2024 ఎలక్షన్ రిజల్ట్

7 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ 32264 ఓట్లు వచ్చాయి. వైసీపీ నేత బిజేంద్రనాథ్ రెడ్డి 28,683 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అంటే 3,581 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మిగతా రౌండ్లు పూర్తయ్యే సరికి భూమా అఖిలప్రియ మరింత మెజారిటీ దక్కించుకునే అవకాశం ఉంది. పోయినసారి ఓడించిన ఆయనను ఆమె ఈసారి ఓడించి లెక్క సరి చేశారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, శిరివెళ్ళ మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,473. ఇక్కడ మొదటినుంచి రెడ్డి సామాజికవర్గ నేతలు గెలుస్తూ వస్తున్నారు. పార్టీ టీడీపీ అయినా, వైసీపీ అయినా ఆళ్లగడ్డలో గెలిచేది మాత్రం రెడ్లే. 2019లో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి 1,05,905 ఓట్లు గెలుచుకున్నారు. 35,613 ఓట్ల తేడాతో భూమా అఖిలప్రియపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో గంగుల, భూమా కుటుంబ సభ్యుల ఒకరికొకరు తలపడుతూ వస్తున్నారు. 1962లో ఆళ్లగడ్డలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల నుంచి వేరే కుటుంబ సభ్యులు పోటీ చేశారు. ఇక ఆ తర్వాత 1967 ఎలక్షన్స్ నుంచి ఈ నియోజకవర్గంలో గంగుల ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తోంది. భూమా కుటుంబం ఒకటే గంగుల ఫ్యామిలీకి గట్టి పోటీని ఇచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఓడించింది కూడా.

బిజేంద్రనాథ్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు. ఈయన బీకాం చదువుకున్నారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంతో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి భూమా అఖిలప్రియ కూడా సైకిల్ పార్టీ కండువా కప్పుకున్నారు. భూమానాగిరెడ్డి చనిపోయాక అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి ఆమె తండ్రికి కుడి భుజంగా ఉన్నటువంటి ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యారు, ఇది చాలదన్నట్టు ఆమె బ్రదర్ భూమా కిషోర్ రెడ్డి వైకాపాలో జాయిన్ అయ్యారు.  ఇవి రెండు ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వస్తున్న ఫలితాల ప్రకారం ఆమెకు ఈ మైనస్‌లు ఉన్నా ఈసారి ఎలాగోలా గెలిచేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>