PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eluru-mp-seema-tdp-boy-became-eluru-mp833d6e0a-acdb-4bc8-8b81-174482fdda9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eluru-mp-seema-tdp-boy-became-eluru-mp833d6e0a-acdb-4bc8-8b81-174482fdda9d-415x250-IndiaHerald.jpgఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేరుపడి ఏలూరు జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఏలూరు పార్లమెంటు సిటీలో ఈసారి అధికార వైసీపీ... ప్రతిపక్ష కూటమి నుంచి ఇద్దరు బిసి యువ నేతల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ముందుగా వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. అనేక ఈక్వేషన్ల తర్వాత సాంప్రదాయంగా కమ్మ‌ సామాజిక వర్గానికి సీటు కేటాయించే తెలుగుదేశం కూడా యాదవ సామాజిక వర్గానికి ఏలూరు పార్లమెంటు సీటు కేటాయించింది. పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan; Eluru MP; mahesh advu{#}sudhakar;chinthalapudi venkatramaiah;sunil;kadapa;Akkineni Nageswara Rao;Eluru;Kumaar;Yuva;Yanamala Ramakrishnudu;Parliament;polavaram;Polavaram Project;District;Backward Classes;Party;Telugu Desam Party;TDP;YCPఏలూరు ఎంపీ: సీమ టీడీపీ కుర్రాడు... ఏలూరు ఎంపీ అయ్యాడు..!ఏలూరు ఎంపీ: సీమ టీడీపీ కుర్రాడు... ఏలూరు ఎంపీ అయ్యాడు..!ap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan; Eluru MP; mahesh advu{#}sudhakar;chinthalapudi venkatramaiah;sunil;kadapa;Akkineni Nageswara Rao;Eluru;Kumaar;Yuva;Yanamala Ramakrishnudu;Parliament;polavaram;Polavaram Project;District;Backward Classes;Party;Telugu Desam Party;TDP;YCPTue, 04 Jun 2024 20:10:00 GMTఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేరుపడి ఏలూరు జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఏలూరు పార్లమెంటు సిటీలో ఈసారి అధికార వైసీపీ... ప్రతిపక్ష కూటమి నుంచి ఇద్దరు బిసి యువ నేతల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ముందుగా వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. అనేక ఈక్వేషన్ల తర్వాత సాంప్రదాయంగా కమ్మ‌ సామాజిక వర్గానికి సీటు కేటాయించే తెలుగుదేశం కూడా యాదవ సామాజిక వర్గానికి ఏలూరు పార్లమెంటు సీటు కేటాయించింది.


పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు అయిన పుట్టా మహేష్ కుమార్ ను రంగంలోకి దించింది. వాస్తవంగా చూస్తే మహేష్ కుమార్ నియోజకవర్గానికి జిల్లాకు నాన్ లోకల్. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి. టిక్కెట్ ఖరారు అయ్యాక నియోజకవర్గంలో అడుగుపెట్టిన మహేష్ కుమార్ కేవలం ఆర్థిక, అంగబ‌లం, పార్టీ బలం చూసుకుని రంగంలోకి దిగారు. పార్లమెంటు పరిధిలో చింతలపూడి ఎస్సీ, పోలవరం ఎస్టి రిజర్వ్ నియోజకవర్గాలతో పాటు నూజివీడు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు జ‌న‌ర‌ల్ స్థానాలు ఉన్నాయి.


ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేతలు అయినా ఎందుకో కానీ ఏలూరు పార్లమెంట్లో సాధారణ జనంకు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తిని ఇక్కడ టీడీపీ పోటీలో పెట్టటం పెద్దగా ఇష్టపడలేదు. అందుకే ముందు నుంచి మహేష్ గెలుపుపై తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడింది. పార్లమెంటు పరిధిలో దెందులూరు, నూజివీడు, కైకలూరు, పోలవరం, చింతలపూడి ఐదు సెగ్మెంట్లో నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరగడంతో ఏలూరు పార్లమెంటుపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్నది చివరి వరకు అంతుపట్టలేదు. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో మ‌హేష్ యాద‌వ్ 1.5 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ పూర్త వ్వ‌కుండానే భారీ మెజార్టీ వ‌చ్చేసింది. ఇది మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>