PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mp-win-hindupoorec361b82-1eaa-4047-a0f6-fe8e9130a42a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mp-win-hindupoorec361b82-1eaa-4047-a0f6-fe8e9130a42a-415x250-IndiaHerald.jpgహిందూపురం.. ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా రాప్తాడు, మడకశిర , హిందూపురం , పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి.. ఇక్కడ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా టిడిపి విజయం సాధించడంతో వైసిపి ఊడ్చుకుపెట్టుకూ పోయిందని చెప్పవచ్చు. ఇక ఈసారి లోకసభ స్థానం కూడా టిడిపిదే అని స్పష్టమైంది. ఈ నియోజకవర్గానికి మే 13వ తేదీన విజయవంతంగా పోలింగ్ పూర్తి కాగా 81.38% ఓటింగ్ నమోదయింది .. దేశ రాజకీయాల్లో అందులోను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలలో హిందూపూర్ లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందTDP;MP;WIN;HINDUPOOR{#}parthasaradhi;Ram Madhav;Shaheen Bhatt;Indian National Congress;Hindupuram;MP;Party;Assembly;Andhra Pradesh;Elections;Telugu Desam Party;YCP;TDPహిందూపురం: లోకసభ స్థానం కూడా టిడిపిదే..!హిందూపురం: లోకసభ స్థానం కూడా టిడిపిదే..!TDP;MP;WIN;HINDUPOOR{#}parthasaradhi;Ram Madhav;Shaheen Bhatt;Indian National Congress;Hindupuram;MP;Party;Assembly;Andhra Pradesh;Elections;Telugu Desam Party;YCP;TDPTue, 04 Jun 2024 22:27:43 GMTహిందూపురం.. ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా రాప్తాడు, మడకశిర , హిందూపురం , పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి.. ఇక్కడ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా టిడిపి విజయం సాధించడంతో వైసిపి ఊడ్చుకుపెట్టుకూ పోయిందని చెప్పవచ్చు. ఇక ఈసారి లోకసభ స్థానం కూడా టిడిపిదే అని స్పష్టమైంది. ఈ నియోజకవర్గానికి మే 13వ తేదీన విజయవంతంగా పోలింగ్ పూర్తి కాగా 81.38% ఓటింగ్ నమోదయింది .. దేశ రాజకీయాల్లో అందులోను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలలో హిందూపూర్ లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది....


2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయా పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది.  వైఎస్ఆర్సిపి అభ్యర్థి గోరంట్ల మాధవ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1,40,748 ఓట్ల మెజారిటీతో మొత్తం 7, 06,602 ఓట్లు సాధించారు. గోరంట్ల మాధవ్ తన ప్రత్యర్థి టిడిపి కి చెందిన నిమ్మల కిష్టప్పపై ఈ విజయం సాధించడం గమనార్హం. ఇక ప్రస్తుతం 2024 ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగాయి ... 2024లో హిందూపురం లోక్సభ నియోజక వర్గానికి వైఎస్ఆర్సిపి తరఫున జోలదరాశి శాంత ఎంపీ స్థానంలో పోటీ చేయగా... తెలుగుదేశం పార్టీ నుంచి బి కే పార్థసారథి పోటీ చేశారు.. అటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సుమద్ షాహిన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.


ఇక ఎవరికి వారు అధికారంలోకి వస్తాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే హిందూపురం ఎంపీ పదవి కోసం పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి కే పార్ధసారథి గెలుపొందారు. భారీ మెజారిటీతో బికె పార్థసారథి ఎంపీ సీటు గెలుపొందినట్లు తాజా ఫలితాలు వెల్లడయ్యాయి.  మొత్తానికైతే అటు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటు లోక్సభ సెగ్మెంట్లో కూడా టిడిపి విజయ ఢంకా మోగించింది.. అధికార పార్టీ వైసీపీ ఇక్కడ ఒక సీటును కూడా దక్కించుకోకపోవడం గమనార్హం.1,25,607 ఓట్ల మెజారిటీతో బికే పార్థసారది ఎంపీ అభ్యర్థిగా గెలిచారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>