PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjpfba7df6d-bb26-4227-a43a-8436473b7472-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjpfba7df6d-bb26-4227-a43a-8436473b7472-415x250-IndiaHerald.jpgభారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇప్పటివరకు రసవత్తరంగా కొనసాగుతోంది.అయితే ఎగ్జిట్ ఫలితాలకు.... పూర్తిగా భిన్నంగా దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అత్యంత భారీ మెజారిటీతో దేశవ్యాప్తంగా విజయం సాధించబోతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. bjp{#}Bengal Tiger;Mamta Mohandas;Rahul Gandhi;West Bengal - Kolkata;history;Ayodhya;Mamata Benerjee;Uttar Pradesh;Congress;India;Parliment;Parliament;Hanu Raghavapudi;Telangana;Bharatiya Janata Party;Partyబెంగాల్‌ టైగర్ దెబ్బకు బిత్తరపోయిన బీజేపీ ?బెంగాల్‌ టైగర్ దెబ్బకు బిత్తరపోయిన బీజేపీ ?bjp{#}Bengal Tiger;Mamta Mohandas;Rahul Gandhi;West Bengal - Kolkata;history;Ayodhya;Mamata Benerjee;Uttar Pradesh;Congress;India;Parliment;Parliament;Hanu Raghavapudi;Telangana;Bharatiya Janata Party;PartyTue, 04 Jun 2024 14:16:00 GMTభారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇప్పటివరకు రసవత్తరంగా కొనసాగుతోంది.అయితే ఎగ్జిట్ ఫలితాలకు.... పూర్తిగా భిన్నంగా దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అత్యంత భారీ మెజారిటీతో దేశవ్యాప్తంగా విజయం సాధించబోతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎక్కడ కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వానికి దీటుగా ఇండియా కూటమి సీట్లను సొంతం చేసుకుంది. అయోధ్య రామ మందిరం కట్టిన ఉత్తర ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లోకి వచ్చింది. అటు రాహుల్ గాంధీ రెండు సీట్లలోనూ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా... కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంటుంది.


అయితే బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మోడీ ప్రయత్నాలను బెడిసి కొట్టింది బెంగాల్ టైగర్ మమత బెనర్జీ. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మమతా బెనర్జీ చరిత్ర సృష్టించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాలలో విజయం సాధించిన బిజెపి పార్టీ... పశ్చిమ బెంగాల్లో ఈసారి పది సీట్లకే పరిమితం కాబోతుంది.  ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అటు మమతా బెనర్జీ పార్టీ 31 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆ 31 స్థానాలు తృణముల్  కాంగ్రెస్ గెలిచేలా కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 42 లోక్సభ స్థానాలు ఉండగా.... మమత బెనర్జీ పార్టీ  31 స్థానాలు ముందంజలో ఉంది. కేవలం పది స్థానాల్లోనే బిజెపి పార్టీ లీడ్ లో కొనసాగుతోంది.ఇక ఈ ఎన్నికల ఫలితాలపై  మమతా బెనర్జీ  స్పందిస్తూ.... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాము ఆశించిన రీతిలో ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించిందని... అందుకే ప్రజలు వారికి తగిన తీర్పు ఇస్తున్నారని ఆమె వెల్లడించారు. అసలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో.... బిజెపి పార్టీకి అవకాశం కూడా రానివ్వమని... మమత బెనర్జీ స్పష్టం చేశారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>