Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi0d84e537-2a9e-4bcb-bd64-357a148620dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi0d84e537-2a9e-4bcb-bd64-357a148620dd-415x250-IndiaHerald.jpgపోరాటాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమైన కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడు అనూహ్యమైన తీర్పును ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎలక్షన్ సమయంలో పోటీలో ఎంత మంది అభ్యర్థులు నిలిచిన ఎంతలా హామీలు కురిపించిన ఎవరికి ఓటు వేయాలో వారికే మద్దతుగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో.. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓటర్ల మద్దతు ఎవరికి ఉంటుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది బిజెపి పార్టీకి సిట్టింగ్ స్థానం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ నBandi{#}Karimnagar;Telangana;Parliment;Bharatiya Janata Party;Party;Congressబండి స్పీడ్ ముందు.. పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్, బిఆర్ఎస్?బండి స్పీడ్ ముందు.. పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్, బిఆర్ఎస్?Bandi{#}Karimnagar;Telangana;Parliment;Bharatiya Janata Party;Party;CongressTue, 04 Jun 2024 16:55:00 GMTపోరాటాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమైన కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడు అనూహ్యమైన తీర్పును ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎలక్షన్ సమయంలో పోటీలో ఎంత మంది అభ్యర్థులు నిలిచిన ఎంతలా హామీలు కురిపించిన ఎవరికి ఓటు వేయాలో వారికే మద్దతుగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో.. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓటర్ల మద్దతు ఎవరికి ఉంటుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.


 అయితే ఇది బిజెపి పార్టీకి సిట్టింగ్ స్థానం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి తెలంగాణ బిజెపి కీలక నేత బండి సంజయ్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా కమలం పార్టీ సిట్టింగ్ స్థానంపై అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీలు కన్నెసాయ్.  అయితే గతంలో ఏకంగా చాలా సార్లు ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు కెసిఆర్. దీంతో గతంలో కరీంనగర్ అనేది గులాబీ పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ బిజెపి దాన్ని బద్దలు కొట్టి కాషాయ జెండా ఎగరవేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తమ కంచుకోటను నిర్మించుకోవాలని  బిఆర్ఎస్ ఇక బిజెపి సిట్టింగ్ సీట్ తమ వశం చేసుకోవాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రయత్నించింది.


 ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రయత్నించినా అటు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ను కమలం పార్టీ నుంచి మాత్రం లాగేసుకోలేకపోయాయి. ఎందుకంటే బండి సంజయ్ మరోసారి కరీంనగర్ లో భారీ విజయాన్ని సాధించారు. సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి కాపాడుకోగలిగారు. ఏకంగా బిఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిశాల రాజేందర్ రావు బరిలో నిలవగా.. ఇక తన ప్రత్యర్థులపై 2.12  లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు బండి సంజయ్. ఇలా వరుసగా రెండోసారి విజయం సాధించిన బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కేంద్రంలో ఈసారి ఏదైనా కీలక పదవి చేపట్టే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>