PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thomasff343b64-1d98-4dd2-bc5b-295730c1c724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thomasff343b64-1d98-4dd2-bc5b-295730c1c724-415x250-IndiaHerald.jpgచిత్తూరు లోక్ సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలో గంగాధర నెల్లూరు ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కృపాలక్ష్మి, కూటమి అభ్యర్థిగా డాక్టర్ వీఎం థామస్ పోటీ చేయడం జరిగింది. గంగాధర నెల్లూరును షార్ట్ కట్ లో జీడి నెల్లూరు అని పిలుస్తారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు కృపా లక్ష్మి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేయగా జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భారీ మెజార్టీతో నా గెలుపును జగన్ కు బహుమతిగా ఇస్తానని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. thomas{#}Gangadhara Nellore;Chittoor;Nellore;Scheduled caste;Doctor;Deputy Chief Minister;Jagan;Assembly;Party;TDP;YCPజీడి నెల్లూరులో ఆ పార్టీ జెండానే ఎగిరిందా.. ఆ అభ్యర్థికి దిమ్మతిరిగే ఫలితాలొచ్చాయా?జీడి నెల్లూరులో ఆ పార్టీ జెండానే ఎగిరిందా.. ఆ అభ్యర్థికి దిమ్మతిరిగే ఫలితాలొచ్చాయా?thomas{#}Gangadhara Nellore;Chittoor;Nellore;Scheduled caste;Doctor;Deputy Chief Minister;Jagan;Assembly;Party;TDP;YCPTue, 04 Jun 2024 17:54:00 GMTచిత్తూరు లోక్ సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలో గంగాధర నెల్లూరు ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కృపాలక్ష్మి, కూటమి అభ్యర్థిగా డాక్టర్ వీఎం థామస్ పోటీ చేయడం జరిగింది. గంగాధర నెల్లూరును షార్ట్ కట్ లో జీడి నెల్లూరు అని పిలుస్తారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు కృపా లక్ష్మి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేయగా జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భారీ మెజార్టీతో నా గెలుపును జగన్ కు బహుమతిగా ఇస్తానని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
ఈ నియోజకవర్గం వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఒకటి కాగా మారిన పరిస్థితుల వల్ల ఈ నియోజకవర్గంలో టీడీపీ కూడా పుంజుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం థామస్ కు ప్లస్ అయింది. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టి లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.
 
జీడి నెల్లూరులో కూటమి అభ్యర్థి థామస్ విజయం సాధించడం గమనార్హం. 24869 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి కృపాలక్ష్మిపై ఆయన విజయం సాధించారు. థామస్ విజయంతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రమంతటా వైసీపీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో జీడి నెల్లూరులో కూడా పార్టీకి షాకింగ్ ఫలితం రావడంలో పెద్దగా ఆశ్చర్యంలో లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఓటమి పాలు కావడం వైసీపీకి మాత్రం ఒకింత షాకేనని చెప్పవచ్చు. వైసీపీకి జీడి నెల్లూరుపై ఒకింత ఎక్కువగా ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు అడియాశలయ్యాయి. జీడి నెల్లూరులో థామస్ సత్తా చాటడం ఆ పార్టీ అభ్యర్థులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితం రావడం కొసమెరుపు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>