PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apc117159f-a08f-417a-8711-cb50eb104d79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apc117159f-a08f-417a-8711-cb50eb104d79-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన నెల 13 వ తేదీన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో 2019 వ సంవత్సరం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయింది. దానితో అది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని అన్ని పార్టీలు చెబుతూ వచ్చాయి. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసిపి ఒంటరిగా బరిలోకి దిగగా , పోయిన సారి భారీ స్థాయిలో ఓటర్ల పై ప్రభావం చూపలేకపోవడంతో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇక వైసిపి పార్టీ ఒంటరిగా ap{#}ramana;Josh;krishna;Srikakulam;Indian Postal Service;Election Commission;Parliment;Assembly;Hanu Raghavapudi;Bharatiya Janata Party;TDP;Telugu Desam Party;Party;Janasena;YCPనరసన్నపేట : రమణ మూర్తి ముందు నిలబడలేకపోయిన కృష్ణదాస్..!నరసన్నపేట : రమణ మూర్తి ముందు నిలబడలేకపోయిన కృష్ణదాస్..!ap{#}ramana;Josh;krishna;Srikakulam;Indian Postal Service;Election Commission;Parliment;Assembly;Hanu Raghavapudi;Bharatiya Janata Party;TDP;Telugu Desam Party;Party;Janasena;YCPTue, 04 Jun 2024 17:55:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన నెల 13 వ తేదీన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో 2019 వ సంవత్సరం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయింది. దానితో అది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని అన్ని పార్టీలు చెబుతూ వచ్చాయి. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసిపి ఒంటరిగా బరిలోకి దిగగా , పోయిన సారి భారీ స్థాయిలో ఓటర్ల పై ప్రభావం చూపలేకపోవడంతో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి.

ఇక వైసిపి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగడం , టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి బరిలోకి దిగడంతో కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇకపోతే మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది.

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన ఎలక్షన్ కమిషన్ కొన్ని గంటల నుండి ఈవిఏం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా మధ్యాహ్నం నుండే కొన్ని కొన్ని నియోజకవర్గాల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇకపోతే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వెలువడింది. ఇక నరసన్నపేట నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ బరిలో నిలవగా , కూటమి నుండి బొగ్గు రమణమూర్తి పోటీలో ఉన్నారు. ఇక వీరిద్దరూ కూడా చాలా రోజులు నరసన్నపేట లో భారీ ఎత్తున ప్రచారాలను చేశారు.

అలాగే వీరిద్దరికి ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని జనాలు భావించారు. కానీ వీరి మధ్య మొదటి నుండి ఏ మాత్రం పోటీ కనబడలేదు. ఓటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి తెలుగుదేశం అభ్యర్థి రమణమూర్తి ఫుల్ జోష్ ను చూపించడం మొదలు పెట్టాడు. ఇక దానితో ఈయనకు 99951 ఓట్లు దక్కాయి. వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి కృష్ణదాస్ కి 70580 ఓట్లు దక్కాయి. దానితో రమణ మూర్తి 29371 ఓట్ల మెజారిటీ తో కృష్ణ దాస్ పై విజయాన్ని సాధించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>